భారత్ కు భారీ జాక్ పాట్.. భారీగా బయటపడ్డ చమురు నిల్వలు.. ఇక తోడుకోవడమే..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య మరోసారి దాడులు జరిగాయి. ఇక ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిన కారణంగా వారం రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం సవరించింది. అంతేకాక గ్యాస్ బుకింగ్, డెలివరీ విధానంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది.
అయితే ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో భారత్ కు మరో జాక్ పాట్ తగిలింది. ఇప్పటికే రాజస్థాన్ జైసల్మేర్ బేసిన్ లోని దండేవాలా క్షేత్రంలో సహజ వాయువు నిల్వలు భారీగా బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ్ బెంగాల్ లోని అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ లో భారీగా చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఇక్కడ త్వరలోనే ముడి చమురు వెలికితీత పనులు ప్రారంభం కానున్నాయి. ఈ చమురు నిల్వలు కోల్ కతాకు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెట్రోలియం, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు 8 ఏళ్ల క్రితమే గుర్తించారు.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 2018 లో ఈ అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ ను కనుగొంది. నివేదికల ప్రకారం.. తూర్పు భారత్ లో చమురు, గ్యాస్ ఉత్పత్తి చేయగల మొదటి ప్రాంతం ఇదే కావడం విశేషం. ఇందులో దాదాపు 24 కోట్ల బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడుతుందనే భయాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు ఇప్పుడు అత్యంత ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది.

బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అశోక్ నగర్ ఫీల్డ్ లో చమురు ఉత్పత్తిని వేగవంతం చేయడంపై బీజేపీ ఎంపీ సమిక్ భట్టాచార్య ఇటీవల దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఇక ఈ చమురు క్షేత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. భారత్ విదేశీ చమురు దిగుమతులు తగ్గడం మాత్రమే కాకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యకు పెద్ద ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications