• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు వెనక కుట్ర దాగి ఉంది: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ

|

ఢిల్లీ: బీజేపీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీకి ఏం కావాలో తాను చెప్పక్కర్లేదని అన్నారు ప్రధాని మోడీ. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ రావడంలో ఢిల్లీ ప్రజలు కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు ప్రధాని . ఢిల్లీలో అన్ని లోక్‌సభ స్థానాలు బీజేపీకే కట్టబెట్టారని అన్నారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో దేశంను మరో స్థాయికి తీసుకెళ్లగలిగామని చెప్పారు.

కేజ్రీవాల్ పార్టీ రాజకీయాలు మాత్రమే చేస్తుంది

కేజ్రీవాల్ పార్టీ రాజకీయాలు మాత్రమే చేస్తుంది

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాష్ట్ర దిశను మార్చివేస్తాయని చెప్పారు. ఢిల్లీ ఓటర్లు వేసే ప్రతి ఓటు ఢిల్లీ నగర సురక్షితం, ఆధునీకీకరణ, పరిశుభ్రతకు ఓటువేస్తున్నారన్న విషయాన్ని మరవకూడదని చెప్పారు. ఇక ఆమ్‌ఆద్మీ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రధాని... అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుందని అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు కావడం లేదని తెలిసినప్పుడు చాలా ఆవేదన చెందానని ప్రధాని మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల గృహాలను నిర్మిస్తే ఢిల్లీలో ఒక్క ఇళ్లును కూడా నిర్మించలేదని ఇందుకు కారణం కేజ్రీవాల్ అని చెప్పారు ప్రధాని మోడీ.

 గృహ నిర్మాణాలను కేజ్రీవాల్ ప్రభుత్వం అడ్డుకుంది

గృహ నిర్మాణాలను కేజ్రీవాల్ ప్రభుత్వం అడ్డుకుంది

ప్రతిఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలనే కల ఉంటుందని అది కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తామంటే కేజ్రీవాల్‌లాంటి మనుషులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మోడీ ధ్వజమెత్తారు. కేవలం రాజకీయం కోసమే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఇక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మోడీ చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్య రామమందిర నిర్మాణం కోసం బాటలు వేశామని, ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని చెప్పారు. కానీ ఢిల్లీలోని ప్రజలు మాత్రం ఇంకా లోక్‌పాల్‌ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. లోక్‌పాల్ గురించి అంతంత మాటలు మాట్లాడిన పెద్దమనుషులు ఏమయ్యారంటూ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు మోడీ. అంతేకాదు మంచి పనులు చేయాలన్న ఉద్దేశమే ఉంటే తమలా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

సీఏఏ నిరసనలు కుట్రలో భాగమే

మనదేశంపై ఉగ్రవాదులు దాడి చేస్తే వారిపై ప్రతీకార చర్యల్లో భాగంగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను అనుమానిస్తున్నారని ప్రధాని అన్నారు. ఢిల్లీ ప్రజలు అలాంటి వారిని కోరుకుంటారా అని ప్రశ్నించారు. భారత్‌ను విభజించాలనుకునే వారికి ఇలాంటి వారు మద్దతు తెలుపుతున్నారని కాంగ్రెస్ ఆమ్‌ ఆద్మీ పార్టీలపై పరోక్ష విమర్శలు చేశారు ప్రధాని. జామియా, షాహీన్‌బాగ్ ఘటనల వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని మోడీ అన్నారు. జామియా, షాహీన్‌బాగ్, సీలంపూర్‌లలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని ఇదంతా ముందస్తు ప్రణాళికతోనే చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీని వెనక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని చెప్పారు.

 ఢిల్లీ వైభవంను కాంగ్రెస్ ఆప్‌ ప్రభుత్వాలు నాశనం చేశాయి

ఢిల్లీ వైభవంను కాంగ్రెస్ ఆప్‌ ప్రభుత్వాలు నాశనం చేశాయి

ఢిల్లీ పూర్వవైభవం గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఢిల్లీ ప్రజల కష్టంతోనే నాడు ఢిల్లీ నగరానికి మంచి పేరు దక్కిందన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీ రాష్ట్రంలో 21వ శతాబ్దపు ఛాయలు కనిపించడం లేదని అన్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆమ్‌ఆద్మీ ప్రభుత్వాలే అని విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే మరో రెండు బహిరంగ సభల్లో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక ఢిల్లీ ఎన్నికలకు ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో చివరి నిమిషంలో బీజేపీ ప్రచార పర్వంలోకి ప్రధాని మోడీని దింపింది. ఇక చివరివారంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ప్రచారం నిర్వహించారు.

English summary
Prime Minister Narendra Modi participated in the Delhi election campaign. While addressing the crowd, the prime minister promised that when BJP comes to power it will work for the unauthorised colonies' development and provide housing for all by 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more