• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీడియో చూడండి : అంబులెన్స్ ట్రీట్‌మెంట్ : తమిళనాడు పోలీసులు ఇస్తున్న చికిత్స జర దేఖో..!

|

తమిళనాడు: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం జరుగింది. అయితే లాక్‌డౌన్ అంటే ఒక్క నిత్యావసర సేవలు తప్ప మిగతావన్నీ బంద్ పెట్టడం అన్నమాట. అంతేకాదు ఎంతో అవసరం తప్పదని తప్పితే ప్రజలు రోడ్లపైకి రాకూడదు. ప్రభుత్వాలు ఎన్నిమార్లు చెప్పినప్పటికీ చేతులెత్తి నమస్కరించినప్పటికీ కొందరు మాత్రం మాట వినడం లేదు. అదేదో తమకోసం కాదని ఎవరికోసమో ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా వ్యవహరిస్తూ యదేచ్ఛగా రోడ్డెక్కేస్తున్నారు. వాహనాలను నడిపేస్తున్నారు. పోనీ ఒక్క బైకుపై ఒక్కరే ఉన్నారా... అంటే అదీ కాదు. ముగ్గురు కలిసి ఒక బైకుపైనే వెళుతున్నారు. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీరే చెప్పండి.. మాట వినని వారికోసం తమిళనాడు పోలీసులు సరికొత్త ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఐడియా ఏంటి...?

  Tamil Nadu Police Video Viral For Ambulance Treatment To Lockdown Violators

  దేశవ్యాప్తంగా కరోనావైరస్ నిత్యావసర సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారం

   తమిళనాడు పోలీసుల సరికొత్త ఐడియా

  తమిళనాడు పోలీసుల సరికొత్త ఐడియా

  ఇంట్లో ఉండండిరా బాబు.. బయట తిరగొద్దు... మాయదారి మహమ్మారి బారిన పడొద్దని ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నప్పటికీ కొందరిలో చలనం లేదు. అంతకుముందు పోలీసులు లాఠీలు ఝుళిపిస్తుంటే ఆ భయంతో రోడ్డుపై కనిపించేవారు కాదు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో ఇక వారిని అడ్డుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా తమిళనాడు పోలీసుల ఆలోచనతో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారి ఒంట్లో వణుకు పుడుతోంది. అంతేకాదు తమిళనాడు పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ఐడియాను పలువురు ప్రశంసిస్తున్నారు.

  అంబులెన్స్ ట్రీట్‌మెంట్

  తమిళనాడులోని తిరుపూరు పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వారిని పట్టుకుని నేరుగా ఓ అంబులెన్స్‌లో పడేస్తున్నారు. అంతే ఆ అంబులెన్స్‌లో వారు నరకం అనుభవిస్తున్నారు. కేకలు పెడుతున్నారు. కాపాడాల్సిందిగా మొత్తుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం కనికరించడం లేదు. ఇంకోసారి నిబంధనలను ఉల్లంఘించము మహాప్రభో అంటూ మొత్తుకుంటున్నప్పటికీ పోలీసులు మాత్రం వినడం లేదు. ఇంతకీ అంబులెన్స్‌లో ఏముందనేగా మీ డౌటు అక్కడికే వస్తున్నాం. పోలీసులు అంబులెన్స్‌లో కరోనా సోకిన వ్యక్తిని ఉంచారు. ఇంకేముందు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకుని ఆ అంబులెన్స్‌లోకి తోసేసి తలపులు మూసేస్తున్నారు. ఇక వారి బాధ చూడాలీ.. భయంతో బెంబేలెత్తి పోయారు.

  పోలీసుల ఐడియాను మెచ్చుకుంటున్న నెటిజెన్లు

  ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంబది. మాస్కులు ధరించకుండా బైకుపై వచ్చిన ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకుని అంబులెన్స్‌లోకి ఈడ్చి పడేశారు. కొందరు అంబులెన్స్ కిటీకీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారి వళ్ల కాలేదు. ఎందుకంటే వారిని బయటకు రాకుండా భయపెట్టేస్తున్నారు పోలీసులు. కారణం అంబులెన్స్‌లో ఉన్నది కరోనావైరస్ పేషెంట్. బయట తిరిగితే ఎలాంటి నష్టం చేకూరుతుందని కరోనావైరస్ పేషెంట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ యువకులు వినడం లేదు. ఎంతసేపు ఎలా బయటపడదామా అనే ప్రయత్నమే చేశారు. వాస్తవానికి అంబులెన్స్‌లో ఉన్నది నిజమైన కరోనావైరస్ పేషెంట్ కాదు. అలా ఓ వ్యక్తిని తయారు చేసి అందులో ఉంచారు.

  మొత్తానికి ఈ ఐడియా భలే వర్కౌట్ అయ్యింది అంటున్నారు నెటిజెన్లు. అయితే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పలు రకాల పనిష్మెంట్లు ఇస్తుండగా తమిళనాడు పోలీసులు ఇస్తున్న పనిష్మెంట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

  English summary
  In what has been hailed by many as a brilliant move, the Tamil Nadu police have received praise for the way they have treated lockdown violators across the state.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X