ఆ నిర్మాతలందరికీ రామ్‌చరణ్ ‘థాంక్స్’ చెప్పాలి!

'పెద్ది' సినిమాకు దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ లాంటి నిర్మాతలంతా కావల్సినంత ప్రచారం చేసిపెట్టారు. థియేటర్లను అద్దె ప్రాతిపదికన కాకుండా పర్సంటేజీల ప్రకారం ఇస్తామని, నిర్మాతలు అలాగే ఇవ్వాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీస్ రవిశంకర్, సితార నాగవంశీ, సాహూ గారపాటిలాంటివారు గట్టిగా వ్యతిరేకించారు. మీ సినిమాలు మీరు విడుదల చేసుకుంటే అద్దె చెల్లిస్తారు.. మేం విడుదల చేస్తుంటే మాత్రం మీకు వాటాల్లో లాభాలివ్వాలా? అంటూ మాట్లాడారు. దీనికి శిరీష్ రెడ్డి గతంలో కూడా ఇలాగే ఓ నిర్మాత మాట్లాడారని, చివరకు ఆయన పరిశ్రమలో లేకుండా పోయారని చెప్పడంద్వారా తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని పరిశ్రమ నుంచి రాజకీయం చేసి పంపేస్తామని పరోక్షంగా హెచ్చించారు.

'పెద్ది' కోసమే ఈ గొడవంతా

ఈ గొడవంతా ఎందుకు జరిగిందంటే రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదల కాబోతోంది కాబట్టి, అందులో వచ్చే లాభాలపై శిరీష్ రెడ్డి, నారంగ్ లాంటివారు కన్నేశారు.రూపాయి కూడా ఖర్చు పెట్టే పనిలేకుండా పెద్దికి భారీ ప్రచారం కల్పించారు. తమ వివాదం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో పెద్ది గురించి నానేలా చేశారు.ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదానికి 'పెద్ది' సినిమానే కేంద్ర బిందువుగా మారింది. 'పెద్ది' లాంటి ఒక భారీ హైప్ ఉన్న సినిమాను టార్గెట్ చేస్తూ, ఆ సినిమా కలెక్షన్లను మైండ్ లో పెట్టుకునే ఎగ్జిబిటర్లు ఈ పర్సంటేజీ విధానాన్ని సరిగ్గా ఇప్పుడే తెరపైకి తెచ్చారని నిర్మాతల వర్గం వాదిస్తోంది. లేదు లేదు.. మా సమస్యలు పాతవే అంటూ అవతలి వర్గం కౌంటర్ ఇస్తోంది.

Ram Charan Peddi Gains Massive Free Publicity Amid Theater Rental vs Percentage Debate

పైసా ఖర్చు లేకుండా

ఈ క్రమంలో యూట్యూబ్ థంబ్ నెయిల్స్ నుంచి, టీవీ ఛానళ్ల డిబేట్ల వరకు, సోషల్ మీడియాలో నెటిజన్ల మీమ్స్, పోస్టుల వరకు ఎక్కడ చూసినా 'పెద్ది' సినిమా పేరే వినబడుతోంది. వివాదం ఏదైనా కానీ.. 'పెద్ది' సినిమాకు మాత్రం థియేటర్ల గొడవ వల్ల కావాల్సినంత రీచ్, పబ్లిసిటీ వచ్చేసాయి. రామ్ చరణ్ అండ్ టీం అఫీషియల్‌గా ప్రమోషన్ల టూర్లు మొదలుపెట్టక ముందే.. ఇటు మీడియా, అటు ఇండస్ట్రీ వర్గాలే 'పెద్ది' సినిమాను నిరంతరం వార్తల్లో ఉంచాయి. నెగెటివ్ టాపిక్‌తో మొదలైనా, అల్టిమేట్‌గా సినిమా పేరు జనంలో నానడానికి ఈ వివాదం బాగా ప్లస్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే.. 'పెద్ది' టీం పైసా ఖర్చు పెట్టకుండానే ఈ వివాదం వల్ల ప్రమోషన్ల పరంగా పెద్ద అడ్వాంటేజ్ సాధించిందని చెప్పాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+