tast: ప్రభుత్వ మద్యం షాపులు, బీరు రుచిగా లేదని ఏం చేశాడంటే, లీక్కర్ షాపులో ; క్లైమాక్స్ లో ?
చెన్నై/దిండుగల్: ప్రభుత్వం తనపని తాను చేసుకుంటే బాగుటుందని, మద్యం వ్యాపారం చేస్తే ధరిద్రంగా ఉంటుందని కొందరు రెచ్చిపోయారు. కష్టపడి సంపాధించిన డబ్బులతో కొందరు బీర్లు కొనుక్కొని తాగాలని అనుకున్నారు. ప్రభుత్వ దుకాణంలోని వైన్ షాప్ లో బీరు కొనుక్కొని తీసుకువెళ్లి తాగారు. బీరు తాగిన వ్యక్తికి ఎక్కడో మండిపోయింది. ఇంత డబ్బలు పెట్టి తీసుకున్న బీరు రుచిలేదని, నకిలీ మద్యం అమ్ముతున్నారని రెచ్చిపోయారు. ప్రభుత్వ లిక్కర్ షాపులో ఉద్యోగం చేస్తున్న సేల్స్ బాయ్ ని బయటకులాగేసి నానా హంగామా చెయ్యడంతో సీన రసవ్తరంగా మారిపోయింది.

న్యూఇయర్ సేల్స్
తమిళనాడులో ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్యం విక్రయిస్తున్న విషయం తెలిసిందే. బీరు తాగితే రుచి లేదని దిండుగల్ జిల్లాలో టాస్మాక్ షాపు కార్మికుడిపై దాడి చేసిన మందు బాబులపై కేసు నమోదైంది. దిండిగల్ జిల్లా బూతంపట్టి వేదసందూర్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తోంది. ఈ షాపులో మల్వార్‌పట్టికి చెందిన బాలమురుగన్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కొత్త సంవత్సరం తొలిరోజు మద్యం దుకాణం కిక్కిరిసిపోయింది.

న్యూఇయర్ రోజు ఫ్రెండ్స్ తో ?
మారంబాడికి చెందిన ప్రవీణ్ ఇద్దరు స్నేహితులతో కలిసి అదేరోజు సాయంత్రం 4 గంటలకు మద్యం దుకాణానికి వెళ్లాడు. మూడు బీర్లు కొనుక్కున్న ముగ్గురు స్నేహితులు మద్యం సమీపంలోనే నిలబడి తాగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురికి ఒక్క బీరు మత్తుగా అనిపించింది. ఆ తర్వాత మద్యం మత్తులో ఆగ్రహించిన ముగ్గురు మళ్లీ మద్యం దుకాణానికి వచ్చారు.

బీరులో ఏముంది ?
బీరులో రుచి చెడిందని ప్రవీణ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి మద్యం దుకాం సిబ్బందితో వాదించాడు. ఖరీదైన బీరు కావాలని వాళ్లు అడిగారు. డబ్బు చెల్లిస్తే ఏదైనా బీరు ఇస్తానని షాపు ఉద్యోగి బాలమురుగన్ సూటిగా చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రవీణ్ తన చేతిలో ఉన్న బీరు బాటిల్ టేబుల్‌పై పగలగొట్టి షాపు ఉద్యోగి బాలమురుగన్‌పై దాడికి యత్నించాడు. బాలమురుగన్ ను చితకబాదేశారు.

సీసీటీవీ పుటేజీలు ?
బాలమురుగన్ అక్కడి నుంచి పారిపోయి ఉన్నతాధికారులకు, వేదచందూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి షాపు తలుపులోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి విచారణలో వివాదంలో ఉన్న వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అని, అతనిపై ఇప్పటికే హత్య కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. హత్యకేసులో జైలుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న ప్రవీణ్ టాస్మాక్ షాపులో గొడవకు దిగినట్లు తేలింది. బాలమురుగన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications