విపక్ష కూటమికి INDIA నామకరణం వెనుక ఇంత జరిగిందా ? వద్దన్న వారే చివరికి అలా..
దేశంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన 26 విపక్ష పార్టీలు రెండు రోజుల పాటు బెంగళూరులో చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో ఓ విషయంలో అయితే పురోగతి సాధించాయి. అది విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడం. అయితే విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడం వెనుక చాలా కథే నడిచినట్లు తెలిసింది. అనేక మలుపుల తర్వాత ఇండియా పేరు, దానికి ట్యాగ్ లైన్ ఖరారయ్యాయి.
ముందుగా విపక్షాల భేటీలో ఇండియా పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉమ్మడిగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ సీఎం, ఈ ఫ్రంట్ కు సమన్వయ కర్త కాబోతున్న నితీశ్ కుమార్ మాత్రం దాన్ని వ్యతిరేకించారు. దీనికి కారణం INDIA ఇంగ్లీష్ పేరులో NDA మూడు అక్షరాలు ఉండటమేనట. దీంతోపాటు D అనే అక్షరానికి డెమోక్రాటిక్ అని పెడితే అచ్చంగా ఎన్డీయే పేరును కాపీ కొట్టేసినట్లే ఉంటుందని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

అయితే నితీశ్ అభ్యంతరం తర్వాత D అక్షరానికి పెడదామని అనుకున్న డెమోక్రాటిక్ పదానికి బదులుగా డెవలప్ మెంటల్ అనే పదం వచ్చి చేరింది. దీంతో పాటు మెజార్టీ నేతలు ఇండియా పేరునే అంగీకరించడంతో నితీశ్ చల్లబడ్డారు. మరోవైపు ఇండియా అనే ఇంగ్లీష్ పేరు మాత్రమే పెడితే బాగోదని, హిందీలో భారత్ అనే పదం కనీసం ట్యాగ్ లైన్ లో అయినా ఉండేలా చూడాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సూచించారు. దీంతో ట్యాగ్ లైన్ లో భారత్ జీతేగా (భారత్ గెలవబోతోంది) అని పెట్టినట్లు తెలుస్తోంది.
అలాగే ఇండియా పేరు ఖరారు చేసిన విపక్షాల నేతలు.. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోపు భారత్ అంతా ఇండియా పేరు మార్మోగాలని, దీన్ని వ్యతిరేకిస్తే ఇండియాను వ్యతిరేకించినట్లే అనే వాదనను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నేతలు నిర్ణయించారు. అందుకు తగినట్లే విపక్షాల భేటీ ముగిశాక నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం రాహుల్ గాంధీ ఇండియా ఎప్పుడూ ఓడిపోలేదన్నారు. అటు మమత కూడా బీజేపీ.. ఇండియాను ఛాలెంజ్ చేస్తావా అని ప్రశ్నించారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications