నేనో ముస్లీం, హిందూ అంటే...: ఆరెస్సెస్ ముస్లీం వ్యక్తి

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) 'హిందూత్వ' అజెండా పైన కాంగ్రెస్, వామపక్షాల వంటివి ఎప్పటికప్పుడు మండిపడుతుంటాయి. ఆరెస్సెస్ హిందూమతతత్వ వాద సంస్థ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాయి. వారి వ్యాఖ్యలకు.. కుహానా లౌకికవాదులు అనే కౌంటర్లు కూడా వినిపిస్తుంటాయి.

రాజకీయంగా ఆ సంస్థ పైన కొన్ని పార్టీలు ఏం మాట్లాడినా, లేదా ఆ పార్టీ లేదా ఇతరులు దానికి ఏం కౌంటర్ ఇచ్చినప్పటికీ... తాజాగా ఓ ముస్లీం యువకుడు మాత్రం ఆరెస్సెస్ భావజాలానికి అర్థం చెప్పారు. ఆరెస్సెస్‌లో ముస్లీం యువకులు కూడా ఉంటారు.

హిందూ, హిందూ రాష్ట్రం అంటే ఏమిటనే వాదనకు ఆరెస్సెస్‌కు చెందిన ముస్లీం యువకుడు సయ్యద్ అహ్మద్ బుఖారీ అనే కరసేవకుడు నిర్వచనం చెప్పారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా అభివర్ణించిన సదరు అతను... హిందూరాష్ట్రంలో అంటే భారత్‌లో పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తి హిందువేనని తేల్చి చెప్పారు.

What is RSS' definition of 'Hindu' and 'Hindu Rashtra'? Muslim man answers

అంతేకాక హిందూ అంటే మతం కాదన్నారు. హిందూ అంటే ఓ జీవన విధానమని చెప్పారు. నేను ఓ ముస్లీంను అని, ఇస్లాం మతాన్నే ఆచరిస్తానని, అయితే నేను గొప్ప సంస్కృతి, సంప్రదాయం, నాగరికత కలిగిన ఈ దేశ పౌరుడినని చెప్పారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టాక హిందూ, హిందూ రాష్ట్రం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ తరహా చర్చ ఇప్పుడే కాదు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ జరిగింది. ఆరెస్సెస్‌ను ఇతర రాజకీయ పార్టీలు సహా ఇస్లామిక్ మతచాందసవాదులు హిందువుల సంస్థగా అభివర్ణిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+