భారత రైల్వే భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతకు తాము మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. భారత రైల్వేలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు విస్తృతస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా సిబ్బంది లేని రైల్వే లెవల్ క్రాసింగ్స్, పట్టాలు తప్పడం వల్ల జరిగే ప్రమాదాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

 ట్రాక్ సేఫ్టీ

ట్రాక్ సేఫ్టీ

రైల్వేకు ట్రాక్ సేఫ్టీ అనేది మొట్టమొదటి ప్రాధాన్యత అని పీయూష్ గోయల్ వివరించారు. సిబ్బంది లేని లెవల్ క్రాసింగ్స్‌పై దృష్టి సారించామని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

- సిబ్బంది లెవల్ క్రాసింగ్స్‌ల కారణంగా 2016-17లో దాదాపు 34శాతం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
- ‘స్పీడ్, స్కిల్, స్కేల్' అనే నినాదంతో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 2019లోపు ఇలాంటి ప్రమాదాలను అరికడతామని చెప్పారు.
- సెప్టెంబర్‌లోనే గత ఏడాది కంటే కూడా మెయింటెనెన్స్ బ్లాక్స్ 13శాతం పెరిగాయి.
- ట్రాక్ మార్పులు లేదా కొత్తవి అమర్చడం లాంటి కూడా తమ ప్రాధాన్యతలో భాగమని చెప్పారు.
- కొత్త ట్రాక్స్ నిర్మిస్తున్నామని, గేజ్ మార్పులు, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

 ప్రమాదాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ట్రాక్ రిప్లేస్‌మెంట్..

ప్రమాదాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ట్రాక్ రిప్లేస్‌మెంట్..

పట్టాలు తప్పడం వల్లే జరిగే ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నామని మంత్రి తెలిపారు. అవసరమున్న చోట కొత్త ట్రాక్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

- ఇంజినీరింగ్ తప్పులు/క్యారేజీ/వ్యాగన్ లోపాలు/సిబ్బంది పర్యవేక్షణ లోపాల కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
- పట్టాలు మార్చడం లేదా కొత్త పట్టాలను వేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
- ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాల్లో కొత్త పట్టాలు వేస్తున్నట్లు చెప్పారు.

కొత్త లైన్లు, సమయ పాలన కూడా తమ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతల్లో ఉందని వివరించారు. పాతబడిన పట్టాలను కొత్త పట్టాలతో మార్చేస్తున్నామని తెలిపారు. భద్రతే ప్రాధాన్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ప్రయాణికులకు ప్రాధాన్యత

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ప్రయాణికులకు ప్రాధాన్యత

ఐసీఎఫ్ డిజైన్లు ఆపేయడం జరుగుతోంది. ప్రయాణికులకు సురక్షితమైన కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మాత్రమే నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 50సంవత్సరాలపాటు సేవలందించిన ఐసీఎఫ్ కోచ్‌ల కాలం చెల్లిందని తెలిపారు.

సాంకేతికాభివృద్ధి ద్వారా మార్పులు

ప్రయాణికులు సౌకర్యంగా, సురక్షితంగా ఉండేందుకు రైల్వేలో కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
- మాన్వల్ ఇంటర్ లాకింగ్ పద్ధతికి బదులు ఎలక్ట్రానిక్ ఇంటర లాకింగ్ సిగ్నల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
- వచ్చే కొద్ది నెలల్లోనే ముంబైలోని అన్ని సబర్బన్ రైళ్లలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలోనే దేశ వ్యాప్తంగా రైళ్లలో కూడా అమలు చేస్తామని చెప్పారు.

 రైల్వే సామర్థ్యం పెంపు..

రైల్వే సామర్థ్యం పెంపు..

ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం రైల్వే సిబ్బందిని భారీ స్థాయిలో పెంచుతామని వివరించారు. ఉద్యోగుల పనితీరులో కూడా మెరుగైన మార్పులు తీసుకొస్తామని తెలిపారు.

- ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన రైల్వే కమిటీ భద్రతకు సంబంధించిన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా పట్టాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు.

- ముంబై సబర్బన్ అడిట్ నివేదికలో అన్ని సబర్బన్ స్టేషన్ల సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కువగా ఎఫ్ఓబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు) నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. కొన్నింటిని విస్తరించాలని, పాతవాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. జోనల్ రైల్వేస్ ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు.

- తాజా టైమ్ టేబుల్ ప్రకారం రైళ్లు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైళ్ల స్పీడ్, భద్రత పెంచేడమే తమ మొదటి ప్రాధాన్యంగా ఉంటుందని తెలిపారు.

ఎంప్లాయ్‌మెంట్ ఎంపవర్‌మెంట్

ఎంప్లాయ్‌మెంట్ ఎంపవర్‌మెంట్

అన్ని రైల్వే పనిదినాల్లో జీఎంలు, డీఆర్ఎంలు, ఫీల్డ్ ఆఫీసర్లు ఫాస్ట్ ట్రాక్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. క్రమంగా రైల్వేలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు.

- జోన్ల జీఎంలకు ప్రయాణికుల భద్రత కోసం చర్యలు చేపట్టేందుకు ఆర్థిక, పరిపాలనా పరమైన అధికారాలను వచ్చే 18నెలల్లో విస్తృతం చేయడం జరుగుతోందని చెప్పారు.
- అన్ని రైల్వే డివిజన్ ఆఫీసుల్లోనూ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్లను భారీగా పెంచడం జరుగుతుందని చెప్పారు. ఇదంతా కార్యకలాపాల సామర్థ్యం పెంచేందుకేనని చెప్పారు.
- గ్రౌండ్ ఆపరేషన్స్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కోసం 200మంది ఆఫీసర్లను హెడ్ క్వార్టర్స్ నుంచి పంపిస్తామని చెప్పారు.
- ఫీల్డ్ తనిఖీలపై అధికారులతో ఒత్తిడి ఉంటోందని అన్నారు.
-ఆఫీసర్లు మొదలగు వారి నివాసాలను సిబ్బంది వాడుకుంటారు. ట్రాక్ సేఫ్టీ లాంటి శాఖల్లో రీపోస్టింగ్ ఉంటుంది. 8వేల మంది ఇప్పటికే వారి పోస్టుల్లో జాయిన్ అయినట్లు తెలిపారు.

 భారత రైల్వే మార్పులకు కీలక నిర్ణయాలు

భారత రైల్వే మార్పులకు కీలక నిర్ణయాలు

ప్రయాణికుల భద్రత కోసం కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

- రైల్వే ప్లాట్ ఫాంలు, పాత్‌వేలు ప్రయాణికులకు సురక్షితంగా ఉంచడం. వారి భద్రత కోసం వెచ్చించే ఖర్చుకు పరిమితి లేదు.
- తుప్పుపట్టకుండా ఉండేందుకు ముందస్తుగా పేయింట్ వేయడం ద్వారా రూ.1500కోట్ల వరకు ఆదా.
-భారతదేశం వ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ అదనపు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం.

‘జీరో యాక్సిండెంట్'(ప్రమాదాలు లేని) స్థాయికి భారత రైల్వేను తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎవరి జీవితమైనా విలువైనదే, వారి మరణం చాలా మందిపై ప్రభావం చూపుతుందని అన్నారు. భద్రత విషయంలో ఉన్న అపోహలను పోగొట్టేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ప్రయాణికుడి ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకే తాము ఎప్పుడూ కృషి చేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Safety of all passengers in Indian Railways is an issue of the utmost importance for Government. Therefore, we have made safety the number one priority. During the first few weeks in office there has been a comprehensive review of safety undertaken to understand the short comings of the Indian railways.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి