రైల్వే ట్రాక్ పై W/L బోర్డు చూశారా?
రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ దగ్గర కూర్చొని బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆనందంలో మునిగిపోతాం. కొన్ని కొన్ని విషయాలను గుర్తించలేము. రైల్వే ట్రాక్‌లపై, రైల్వే క్రాసింగ్స్ వద్ద రైల్వే శాఖ కొన్ని బోర్డులను ఏర్పాటు చేస్తుంది. వాటిపై W/L అని ఉంటుంది. W/L అంటే విజిల్ / లెవెల్ బోర్డ్ అని అర్థం. రైల్వే ట్రాక్ కు రెండువైపులా ఉంచుతారు. లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడానికే వీటిని ఏర్పాటు చేస్తారు. 600 మీటర్ల ముందు ఏర్పాటు చేసిన బోర్డు గుండా వెళ్లే సమయంలో లోకో పైలట్‌కు హారన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ బోర్డును దాటే వరకు హరన్ మోగించాలి. ఎందుకంటే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరుగకుండా నివారించేందుకు ముందుగానే రైలు వస్తోందని తెలియజేయడానికి సంకేతం ఈ హారన్.
పసుపురంగు బోర్డుపై W/L అని నలుపు రంగలో రాసివుంటుంది. ఐవిజన్ ను దృష్టిలో ఉంచుకొని వీటిని రాస్తారు. దూరం నుంచి చూసినా కనపడేలా ఉంటుంది. క్రాసింగ్ గేటు దగ్గర పైలట్ హారన్ కొడుతూ హెచ్చరిస్తారు. సుమారు 2100 మిల్లీమీటర్ల ఎత్తులో దీన్ని ఉంచుతారు. ఇంగ్లిషుతోపాటు హిందీలో కూడా రాస్తారు. బోర్డుల వైశాల్యం 600 చదరపు మిల్లీమీటర్లు. ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి

భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందజేసేందుకు అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. రైలు పట్టాలను కనీసం 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా తట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా 70వేల కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. వీటిల్లో అత్యధికం డబ్లింగ్. వందే భారత్ పేరుతో ప్రవేశపెడుతున్న రైళ్లద్వారా ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా రూపొందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ అందుబాటులోకి వచ్చింది. వచ్చే నెల 8వ తేదీన సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని రైళ్లల్లో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications