వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంద, వెయ్యి తెలుసు.. 'జీరో నోటు' గురించి తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వంద నోటు, వెయ్యి నోటు గురించి వినుంటారు గానీ జీరో నోటు గురించి ఎప్పుడైనా విన్నారా! బహుశా అతికొద్ది మంది మాత్రమే దీని గురించి వినుంటారు. ఫిఫ్త్ పిల్లర్ పేరిట ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్థ జీరో నోట్లను 2007లో ప్రవేశపెట్టింది. వీటి ఉద్దేశ్యం.. కేవలం లంచావతారుల ఆట కట్టించడానికి మాత్రమే.

అంటే.. ఎవరైనా లంచం అడిగినప్పుడు ఈ జీరో నోటును తీసి సదరు లంచాధికారి చేతిలో పెట్టాలన్నమాట. నోటుపై 'నేను లంచం ఇవ్వను, తీసుకోబోనని ప్రమాణం చేస్తున్నా' అన్న హెచ్చరిక రాసి ఉంటుంది. తద్వారా లంచం అడిగినవాళ్లకు.. తమ డిమాండ్ చట్ట విరుద్దమన్న భావన కలిగే అవకాశం ఉంటుందనేది ఫిఫ్త్ పిల్లర్ సంస్థ ఆలోచన.

What is a zero rupee note?

జీరో నోటు ద్వారా చాలామంది లంచాధికారుల్లో మార్పు తీసుకొచ్చినట్టు.. గతంలో తమ వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది ఫిఫ్త్ పిల్లర్. భారత్ లో జీరో నోటు ద్వారా సాధించిన విజయం.. నేపాల్‌, ఘనా, బెనిన్‌, మెక్సికో, యెమెన్‌వంటి దేశాలపైనా ప్రభావం చూపించినట్టుగా సంస్థ పేర్కొంది. జీరో నోటు ద్వారా అవినీతి సమూలంగా పెకిలించివేయడం సాధ్యం కాకపోయినప్పటికీ.. కొంతలో కొంత నిర్మూలించగలిగిన అది సమాజానికి శ్రేయస్కరమే అన్నది చాలామంది వాదన.

ఇక ఈ జీరో నోటు ఎలా ఉంటుందంటే.. పూర్తిగా రూ.50ను పోలి ఉంటుంది. అదే రంగులో.. కుడివైపున గాంధీ బొమ్మతో అచ్చు రూ.50 లాగే ఉంటుంది.

English summary
The Zero rupee note, is the mascot or primary campaign tool of a non-governmental organization known as 5th pillar.Introduced in 2007 in India as a means to fight and abort systemic political corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X