శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ: అందులో ఏముంది?(ఫోటోలు)

చెన్నై: తాను తిరిగి ముఖ్యమంత్రిని కావాలని ఒక వీరాభిమాని శిలువ వేయించుకోవడంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. ఇలాంటి చర్యలు సరైనవి కావని ఆ వీరాభిమానికి జయలలిత స్వయంగా లేఖ రాశారు.

లేఖ సారాంశం తెలుగులో:

డియర్ షిహాన్ హుస్సేని,

"నాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా కోసం చాలా బాధ అనుభవించావు. ఈ సంగతి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. ఇంకెప్పుడూ, శరీరానికి బాధ కలిగించే ఈ తరహా చర్యలు వద్దు. నీ భావి జీవితం గురించి ఆలోచించు. గాయాల పాలు కావద్దు" అని లేఖలో తెలిపారు.

భవదీయులు

జయలలిత

67వ పడిలోకి అడుగుపెట్టిన జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం 67వ పుట్టిన రోజు జరుపుకున్నారు. తమిళ అభిమానుల జయలలితను ముద్దుగా 'అమ్మ'గా పిలుచుకునే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

చెన్నై బిసెంట్‌నగర్‌ కళాక్షేత్ర కాలనీలో అంతర్జాతీయ స్థాయి కరాటే, విలువిద్య క్రీడాకారుడు హుసైనీ సోమవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించిన... తర్వాత సిద్ధంగా ఉంచిన ఎనిమిది అడుగుల ఎత్తులోని శిలువపై హుసైనీ ముందుగా తన ఎడమ చేతికి స్వయంగా మేకు దిగ కొట్టుకున్నాడు. అనంతరం కొంత మంది సహాయకులు హుసైనీ కుడిచేతికి, రెండు కాళ్లకు మేకులు దిగ కొట్టారు. ప్రార్థనల అనంతరం ఆయనను శిలువ నుంచి దించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

 శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

అన్నాడిఎంకె అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఓ అభిమాని సోమవారం తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రానికి జయలలిత తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అతను తనకు తానే శిలువ వేసుకున్నాడు.

 శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

కరాటే నిపుణుడైన శిహాన్ హుస్సేన్.. చేతులకు, కాళ్లకు మేకులు కొట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. శిలువ ఆకారంలో ఉన్న కర్రదుంగలకు కట్టేసుకుని.. 6 ఇంచుల మేకులు కొట్టించుకుని అతడు అలాగే శిలువకు నిలబడిపోయాడు. సుమారు 10 నిమిషాలపాటు అతడు అలాగే నిల్చున్నాడు.

శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

అమ్మ(జయలలిత)ను తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నట్లు హుస్సేన్ తెలిపాడు. త్వరలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న జయలలితకు.. ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

 శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

శిలువ వేసుకున్న అభిమానికి జయలలిత లేఖ

జయలలితపై వీరాభిమానంతో హుస్సేనే చేతులకు, కాళ్లకు మేకులు కొట్టుకున్నాడు. శిలువెక్కాడు. దీనికి మరికొంత మంది సహకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+