దినకరన్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు: ఎఫ్ఐఆర్‌లో షాకింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: టిటివి దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి రూ.50 కోట్ల లంచం ఇవ్వచూపిన కేసులో పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేశారు. ఇందులో దినకరన్‌తో పాటు మధ్యవర్తి సుఖేష్ పేర్లు ఉన్నాయి.

అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కోసం దినకరన్, సుఖేష్ చంద్రశేఖర్ చక్రం తిప్పినట్లుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. సుఖేష్ బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి అని పేర్కొన్నారు.

సుఖేష్ గతంలోను పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. సుఖేష్ పైన బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కేసులు ఉన్నాయని పేర్కొంది.

What the FIR against TTV Dinakaran and Sukesh Chandrasekhar says

ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఏప్రిల్ 15వ తేదీన ఈ కుట్రకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. సుఖేష్ చంద్రశేఖర్ పేరుతో తమకు సమాచారం అందిందని తెలిపారు.

తమకు వచ్చిన సమాచారం మేరకు సుఖేష్ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో 263వ నెంబర్‌లో ఉన్నట్లు సమాచారం అందిందని, అతని వద్ద పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయని తెలిసిందని పేర్కొన్నారు.

సుఖేష్ ఎంపీగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. తన కారు నెంబర్ ప్లేటు పైన కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉంది. అలాగే, టీటీవీ దినకరన్‌తో ఎలా టచ్‌లో ఉన్నడో కూడా తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. సుఖేష్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు గుర్తించినట్లు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sukesh Chandrasekhar, the man who has been arrested in the TTV Dinakaran bribery case moved around in a Mercedez Benz, posed as an MP and had the number plates of his car painted to pull off the act, says the FIR filed by Delhi police. A day after AIADMK Amma's TTV Dinakaran was booked for charges of bribery, the FIR filed by the Delhi police against him has been made public.
Please Wait while comments are loading...