యాజర్లకు ఇచ్చిన మాట తప్పలేం-ఐటీ రూల్స్ పై ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్, ఫేస్ బుక్

దేశంలో సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల కలకలం ఇంకా చల్లారలేదు. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అదే క్రమంలో ఇవాళ ఫేస్ బుక్, వాట్సాప్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్రం వైఖరిని సవాల్ చేశాయి.

దేశవ్యాప్తంగా మే 26న అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల్లోని గోప్యత కు సంబంధించి సెక్షన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాట్సాప్, ఫేస్ బుక్ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. వాట్సాప్, ఫేస్ బుక్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

whatsapp and facebook challenge central govts new it rules over privacy in delhi high court

తమ యూజర్ల గోప్యతను కాపడతామంటూ గతంలో తాము హామీ ఇచ్చామని, కానీ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ కారణంగా ఈ మాట నిలబెట్టుకోలేని పరిస్ధితి ఎదురవుతోందని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్, ఫేస్ బుక్ తెలిపాయి. ఏదైనా ఓ వివాదస్పద మెసేజ్ ఫేస్ బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ వచ్చినప్పుడు దాని మూలాలు ఎక్కడున్నాయో వివరాలు ఇవ్వాల్సిందేనని కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ నిబంధనలు చెప్తున్నాయని సోషల్ మీడియా సంస్ధలు హైకోర్టు దృష్టికి తెచ్చాయి. కానీ తమ యూజర్ల గోప్యతా విధానం కారణంగా వాటిని ఇవ్వలేమని చెప్తున్నాయి.

యూజర్లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం భారత్ లో ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం కూడా చెల్లదని వాట్సాప్, ఫేస్ బుక్ వాదిస్తున్నాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది. గతంలో భారత్ లో ఉన్న చట్టాల్ని తప్పకుండా అమలు చేయాలని సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐటీ రూల్స్ ప్రకారం మిగతా నిబంధనలు పాటించేందుకు సిద్దమని, కానీ గోప్యతా నిబంధనలు మాత్రం పాటించలేమని సోషల్ మీడియా సంస్ధలు చెప్తున్నాయి. తమ యూజర్లకు ఇచ్చిన హామీలే ఇందుకు కారణంగా చూపుతున్నాయి.ఇందులో రాజ్యాంగ నిబంధనల్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు .. ప్రభుత్వం తరఫున న్యాయవాది అందుబాటులో లేని కారణంగా కొంతకాలం పాటు విచారణ వాయిదా వేయాలని కేంద్రం కోరడంతో అక్టోబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+