Status: కౌన్సిలర్ పేరు స్టేటస్ లో పెట్టి ఆత్మహత్య, ఇంటి లేడీ ఓనర్ తో ?, ఇద్దరూ లేడీ భర్తకు !
బెంగళూరు/చిక్కబళ్లాపురం: నా ఆత్మహత్యకు నగరసభ కౌన్సిలర్ కారణం అని వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మా తమ్ముడి ఆత్మహత్యకు కౌన్సిలర్ తోపాటు మా తమ్ముడు అద్దెకు ఉంటున్న ఇంటి లేడీ ఓనర్ కారణం అని బాధితుడి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఇంటి ఓనర్ భర్త చనిపోవడం, తరువాత ఆత్మహత్య చేసుకున్న వ్యక్తితో ఆమెను చనువుగా ఉండటం అందరికి తెలుసని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని వెలుగు చూసింది. అయితే మద్యలో కౌన్సిలర్ ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాడు. ఇంటి ఓనర్ భర్త, కౌన్సిలర్, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ కావడం, తరువాత ముగ్గురు మూడు లోకాలు కావడంతో కథ రసవత్తరంగా మారింది. అయితే మ్యాటర్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ అంతం అవుతుందో అంటూ లేడీ ఓనర్ హడలిపోతుందని తెలిసింది.

ఫైనాన్స్ వ్యాపారి
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం (బెంగళూరు-హైదరాబాద్ హైవే)లోని వార్డు నెంబర్ 15లోని నంది రోడ్డులో రమేష్, సుమా దంపతులు నివాసం ఉంటున్నారు. రమేష్, శిల్పా దంపతులకు పిల్లలు ఉన్నారు. రమేష్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. చిక్కబళ్లాపురంలో రమేష్ కు చాలా మంది స్నేహితులతో పాటు అతని వర్గం యువకులు నిత్యం టచ్ లో ఉండేవారు.

శిడ్లఘట్ట టూ చిక్కబళ్లాపురం
చింతామణి సమీపంలోని శిడ్లఘట్టకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు 12 సంవత్సరాల క్రితం మంగళ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. రమేష్, మంగళ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చిక్కబళ్లాపుర చేరుకున్న ప్రశాంత్ ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఎస్ఎన్ఎన్ ఆర్ట్స్ అండ్ స్టిక్కర్ కటింగ్ షాపు ప్రారంభించాడు.

పొలిటికల్ లీడర్
చిక్కబళ్లాపురం నగరసభ 15వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన అంబరీష్ ఆ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించాడు. చిక్కబళ్లాపురంలో అంబరీష్ కు మంచి పలుకుబడి ఉంది. ఓ వర్గంలో అంబరీష్ కొంచెం మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కౌన్సిలర్ అంబరీష్, ఫైనాన్సియర్ రమేష్, స్టిక్కర్ కటింగ్ షాపు యజమాని ప్రశాంత్ స్నేహితులు.

ఫ్రెండ్ ఇంట్లో మకాం.... కరోనాతో భర్త ?
ఫైనాన్సియర్ రమేష్ కు నందిరోడ్డులో సొంత ఇల్లు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంత్ అతని ఫ్రెండ్ రమేష్ ఇంటి కింద పోర్షన్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం కరోనా వ్యాధి సోకడంతో చికిత్స విఫలమై రమేష్ చనిపోయాడు. భర్త రమేష్ బతికున్న సమయంలోనే అతని భార్య సుమా ప్రశాంత్ తో చాలా క్లోజ్ గా ఉండేదని తెలిసింది.

జల్సాలు చేస్తున్నారు
భర్త రమేష్ చనిపోయిన తరువాత అతని వ్యాపార లావాదేవీలు ఎక్కువగా కౌన్సిరల్ అంబరీష్ చూసుకుంటున్నాడు. భర్త చనిపోయిన తరువాత సుమా కింద ఇంట్లో అద్దెకు ఉంటున్న ప్రశాంత్ చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ మ్యాటర్ తెలుసుకున్న ప్రశాంత్ భార్య మంగళ అతనికి విడాకులు ఇచ్చేసి శిడ్లఘట్టకు వెళ్లిపోయింది.

ఆవిషయంలో తేడాలు ?
భార్యకు విడాకులు ఇచ్చేసిన ప్రశాంత్ అతని తల్లిని పిలుచుకుని వచ్చి చిక్కబళ్లాపురం ఇంట్లో పెట్టుకున్నాడు. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న సుమా, భార్యకు విడాకులు ఇచ్చిన ప్రశాంత్ భార్య,భర్తలాగా విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సుమా భర్త రమేష్ కు చెందిన ఆర్థిక లావాదేవీలు చూసుకునే విషయంలో ప్రశాంత్, కౌన్సిలర్ మద్య తేడా కొట్టింది.

కౌన్సిలర్ తో చనువు పెంచుకున్న సుమా ?
ఇదే సందర్బంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న అంబరీష్ తో సుమా చనువు పెంచుకుందని తెలిసింది. ఇదే విషయంలో సుమా, ప్రశాంత్ ల మద్య గొడవలకు దారితీసింది. చాలాసార్లు సుమా, ప్రశాంత్, అంబరీష్ గొడవపడ్డారని సమాచారం. ప్రశాంత్ తల్లి బెంగళూరులోని కూతురి ఇంటికి వెళ్లిన సమయంలో ప్రశాంత్ సుమా కింద ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

నా ఆత్మహత్యకు కౌన్సిలర్ కారణం
ప్రశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు నా ఆత్మహత్యకు కౌన్సిలర్ అంబరీష్ కారణం, అందరూ అనుభవిస్తారు అంటూ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ ఆత్మహత్యకు కౌన్సిలర్ అంబరీష్ తోపాటు మా తమ్ముడు అద్దెకు ఉంటున్న ఇంటి లేడీ ఓనర్ సుమా కారణం అని బాధితుడి సోదరుడు, వాళ్ల కుటుంబ సభ్యులు చిక్కబళ్లాపురంలో కేసు పెట్టారు. ప్రశాంత్, సుమా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తరువాత అంబరీష్ వచ్చి సుమాను లొంగదీసుకున్నాడని, ఈ విషయం జీర్ణించుకోలేక ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని అక్క పోలీసు కేసు పెట్టారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications