వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, మన్మోహన్‌తో నేను మాట్లాడనా?: రంగంలోకి ఎల్‌కే అద్వానీ

ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదించటంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌తో మాట్లాడతానని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అవసరమైన సమయంలో రంగంలోకి దిగుతానని సంకేతాలిచ్చారు. తమ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు జాతీయ భద్రతకు సంబంధించిన కీలక బిల్లులపై ప్రతిపక్ష నేతలతో మాట్లాడేందుకు సిద్ధమమని స్పస్టం చేశారు.

మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నుంచి బయటకు వస్తుండగా ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదించటంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌తో మాట్లాడతానని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, అనంత్‌కుమార్‌లకు తెలిపారు.

అంతకుముందు ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ.. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌పై ఆర్డినెన్స్‌, లేకపోతే స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ తీసుకురావడంపై మాట్లాడారు. ఈ చట్టంప్రకారం చైనా, పాకిస్థాన్‌లకు పారిపోయిన శత్రువుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఆర్డినెన్స్‌ను లోక్‌సభలో ఆమోదించారు.

When Advani Told Party He Wants To Speak To Sonia Gandhi, Manmohan Singh

కానీ, రాజ్యసభలో ఎన్‌డీఏకు బలం లేకపోవడంతో నిలిచిపోయింది. దీనిని సజీవంగా ఉంచేందుకు ఆర్డినెన్స్‌ తర్వాత ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సి వస్తోంది. డిసెంబర్‌లో ఐదోసారి ఈ ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి వద్దకు వెళ్లగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే సంతకం చేసినట్లు తెలిసింది.

జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఆయన కాదనలేని పరిస్థితి నెలకొంది. దీనిపై పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగియగానే అద్వానీ మాట్లాడుతూ.. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్ని కాంగ్రెస్‌ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. దీనిపై తాను సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌లతో మాట్లాడతానని చెప్పారు. బిల్లుకు ఆమోదం లభించేందుకు వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇప్పటికే ఈ బిల్లుపై సోనియా గాంధీతో తాను చర్చించినట్లు అద్వానీ తెలిపారు.

English summary
After a meeting of BJP lawmakers on Tuesday morning, party patriarch LK Advani reportedly stopped three top ministers and declared that he was ready to speak to Congress leaders Sonia Gandhi and Manmohan Singh to resolve a niggling problem for the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X