కాంగ్రెస్ ముక్త్ భారత్‌తోనే పేదరిక నిర్మూలన : రాజ్‌నాథ్ సింగ్

కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. ఆ పార్టీ విధానాల వల్లే దేశం అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ఆయన బెంగాల్‌లోని హావ్డాలో గురువారం ప్రచారం నిర్వహించారు.

 when congress mukth in india there will be no poverty

ఇంకెన్నాళ్లీ హామీలు
ఎన్నికల వేళ న్యాయ్, పేదరిక నిర్మూలన అంటూ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మసిపూసి మారేడు కాయ చేయడమేనని ఆరోపించారు. నెహ్రూ హయాం నుంచి పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోంది. ఇంకెన్నాళ్లు ఈ హామీల కబుర్లు చెబుతారని ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి దేశం విముక్తి పొందిన రోజే పేదరిక సమస్య పరిష్కారమవుతోందన్నారు రాజ్‌నాథ్ సింగ్.

విపక్షాలపై హింసనా ?
పనిలో పనిగా బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉనికి కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీలపై హింస కొనసాగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీకి అధికారం కట్టబెడితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించేందుకు పోరాడుతామని హామీనిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+