రూ.1, రూ.250తో యోగి ఆదిత్యనాథ్ షాక్: వారు నివ్వెరపోయారు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేస్తామని బిజెపి చెప్పింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక కృషి రీన్ యోచన్ యోజనా పేరుతో రైతులకు రూ.లక్ష దాకా రుణమాఫీ చేసే నిర్ణయం తీసుకున్నారు.

తద్వారా 2.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. కానీ అమలులో మాత్రం రైతులకు అన్యాయం జరిగిందంటున్నారు.

When farmers got Rs. 1 loan waiver

ఒక్కొక్కరికి రూ.1 నుంచి రూ.లక్ష వరకు రుణమాఫీ కావడం గమనార్హం. కొందరు రైతులకు రూ.10, రూ.215 మాఫీ కావడంతో వారు తమ సర్టిఫికేట్లు చూసి షాకయ్యారు.

ఉమ్రి గ్రామానికి చెందిన శాంతిదేవకు రూ.1.55 లక్షలు ఉండగా కేవలం రూ.10.37, మౌదాహ గ్రామానికి చెందిన మున్నీలాల్‌కు రూ.40వేలు ఉండగా కేవలం రూ.215 మాఫీ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు రుణమాఫీ పత్రాలు అందుకున్నారు. 4,814 మందికి రూ.1 నుంచి రూ.100 వరకు, 6,895 మందికి రూ.100 నుంచి రూ.500, 5,553 మందికి రూ.500 నుంచి రూ.1000 మధ్య రుణమాఫీ అయినట్లు సర్టిఫికేట్ పొందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Over 17,260 farmers in Uttar Pradesh have received loan waiver certificates for only Rs. 1,000 or less under a scheme in which the BJP government had promised to waive farm loans of up to Rs. 1 lakh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి