మేక్ ఇన్ ఇండియాపై ఆసక్తి: మోడీతో సత్యనాదేళ్ల మళ్లీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల శుక్రవారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం సత్య నాదేళ్ల భారత్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మోడీతో భేటీ అయ్యారు. కాగా, సత్య భారత్‌లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే అవకాశముంది.
ఇదిలా ఉండగా, సత్య నాదేళ్ల ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఇది రెండోసారి. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గతంలో ఓసారి భారత్ వచ్చారు. అప్పుడు కూడా సత్య నాదేళ్ల ప్రధానితో భేటీ అయ్యారు.
రవిశంకర ప్రసాద్‌తో సత్య నాదెళ్ల భేటీ
అంతకముందు సత్య నాదెళ్ల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అమెరికా సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్టు కూడా భాగస్వామి కావొచ్చుని చెబుతున్నారు.
రవిశంకర ప్రసాద్‌తో భేటీ అనంతరం సత్య నాదెళ్ల మాట్లాడారు. ఈ మొబైల్, క్లౌడ్ ప్రపంచంలో ప్రతి భారతీయుడిని భాగస్వామి చేయాలని ఆకాంక్షించారు.
అలాగే భారత దేశంలోని ప్రతి వ్యాపార సంస్థ కూడా కొత్తగా వస్తున్న ప్రతి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా భారత దేశంలో ఉన్న సమయాన్ని తాను అద్భుతంగా భావిస్తానని చెప్పారు. మంత్రితో పలు అంశాలు చర్చించారు.

మోడీతో సత్య నాదెళ్ల
సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల శుక్రవారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సత్య నాదెళ్ల కొన్నాళ్ల క్రితం భారత్ వచ్చారు. అప్పుడు కూడా మోడీతో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రితో సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చేపట్టిన విషయం తెలిసిందే.

కేంద్రమంత్రితో సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్‌తో భేటీ అయ్యారు. కేంద్రమంత్రితో చేయి కలుపుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.

జైట్లీతో నాదెళ్ల
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో శుక్రవారం నాడు సాయంత్రం సమావేశమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. జైట్లీతో చేయి కలుపుతున్న నాదెళ్ల.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications