చీతాలు కాదు.. ముందు ఛీటర్లను రప్పించండి స్వామీ..!!
బెంగళూరు: నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పుట్టినరోజును పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. ఎన్‌క్లోజర్లల్లో ఉన్న వాటికి స్వేచ్ఛ కల్పించారు. అంతరించిపోతోన్న వన్యప్రాణుల జాబితాలో చేరిన చీతాలను సంరక్షించడానికి, వాటి సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు.
కొన్ని ఆఫ్రికన్ దేశాలు, ఇరాన్‌లో మాత్రమే చీతాల సంఖ్య పరిమితంగా ఉంటోంది. ఒకప్పుడు భారత్- ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. క్రమంగా వాటి సంఖ్య భారీగా తగ్గింది. 1952 నాటికి అవి అంతరించిపోయిన వన్యప్రాణుల జాబితాలో చేరాయవి. దేశీయంగా చీతాల సంతతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కునో నేషనల్ పార్క్‌ను ఎన్నుకుంది. అక్కడ వాటి సంరక్షణ చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటిని పరిరక్షించనుంది కేంద్రం.

ఈ పరిణామాలన్నింటిపై ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీకి చురకలు అంటించారు. సెటైర్లతో చెలరేగారు. మోదీ స్వదేశానికి రప్పించాల్సింది చీతాలు మాత్రమే కాదని.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులను కూడా పిలిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను ఏ ఛీటర్ల గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా? అని ప్రశ్నించారు.
Dear supreme leader.. when will you get these CHEATahhs.. .. #justasking pic.twitter.com/h1ASmJMgGc
— Prakash Raj (@prakashraaj) September 17, 2022
డియర్ సుప్రీం లీడర్.. అంటూ ప్రధాని మోదీని సంబోధించారు ప్రకాష్ రాజ్. ఈ ఛీటర్లను ఎప్పుడు స్వదేశానికి తీసుకొస్తారు..? అని ప్రశ్నించారు. తన ట్వీట్‌కు లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ ఫొటోలను జత చేశారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే ఈ ముగ్గురు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోయిన విషయాన్ని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రస్తావించారు.
విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులను ఎదుర్కొంటోన్నారు. వారిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారులు కేసులు నమోదు చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఇంగ్లాండ్‌లో నివసిస్తోన్నారు. మేహుల్ చోక్సీ.. అంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటోన్నారు. వారిని స్వదేశానికి రప్పించడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications