మయన్మార్ సరిహద్దులో ఉగ్రవాదుల స్థావరం నేలమట్టం : ఆరాకన్ ఆర్మీ శిబిరాలపై భారత్, మయన్మార్ ఆర్మీ దాడి

న్యూఢిల్లీ : పుల్వామా దాడి తర్వాత ఉప ఖండంలో పరిస్థితి మారిపోయింది. బాలాకోట్ దాడులతో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా అందరూ ఎదురుచూస్తుంటే మన వీర సైనికులు ఉగ్రవాదులను ఎరిపారేశారు. మయన్మార్ కు చెందిన ఆరాకన్ ఆర్మీ (కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ) ఉగ్రవాద సంస్థను మయన్మార్ ఆర్మీతో కలిసి మన సైనికులు తుదమొట్టించారు. ఈ ఆపరేషన్ గత నెల 17 ప్రారంభమై .. మార్చి 2 ముగిసింది.

ప్రాజెక్టుపై దాడికి యత్నం ?

ప్రాజెక్టుపై దాడికి యత్నం ?

ఇండో మయన్మార్ సరిహద్దులో మెగా రవాణా ప్రాజెక్టు కలదాన్ నిర్మాణం పూర్తికావొచ్చింది. ఈ ప్రాజెక్టుతో కోల్ కతా మయన్మార్ లోని సిట్ వే పోర్టును కలుపుతోంది. దీంతో వీటి మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. ప్రయాణం దాదాపు 5 గంటల వరకు తగ్గుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న ఆరాకన్ ఆర్మీతో ముప్పు ఉన్నది. ఈ క్రమంలో ఆరాకన్ ఆర్మీ పని కానిచ్చింది భారత సైన్యం.

 నిఘావర్గాల సమాచారంతో ..

నిఘావర్గాల సమాచారంతో ..

కలదాన్ ప్రాజెక్టుకు ఆరాకన్ ఆర్మీతో ముప్పు ఉన్నదని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో భారత సైన్యం వారి పని పట్టేందుకు దక్షిణ మిజోరం వద్ద కాపుకాచి .. ప్రణాళిక ప్రకారం దాడిచేసింది. తొలుత కొత్తగా మిజోరం వద్ద నిర్మాణమయ్యే కలదాన్ ప్రాజెక్టు వద్ద నుంచి ఉగ్ర మూకల ఎరివేత ప్రక్రియను చేపట్టింది. రెండో విడత అరుణచల్ ప్రదేశ్ సరిహద్దుకు అనుకొని వెయ్యి కిలోమీటర్ల దూరంలో గల నాగా గ్రూప్ ను అంతమొందించింది. రెండువారాల్లో ఇండో మయన్మార్ సరిహద్దులో పూర్తిగా భద్రతాబలగాలను మొహరించి .. ఆ తర్వాత మార్చి 2న వారిని తుదిమొట్టించింది. ఈ దాడుల్లో 12 క్యాంపులను నిర్వీర్యం చేశామని పేర్కొన్నారు. ఇందుకోసం 2 నెలల క్రితమే ప్రణాళిక రచించినట్టు తెిపారు.

పక్కా ప్రణాళికతో దాడి ..

పక్కా ప్రణాళికతో దాడి ..

ఆరాకన్ ఆర్మీ తుదమొట్టించడంలో భారత సైన్యానికి చెందని స్పెషల్ ఫోర్స్, అసోం రైఫిల్స్, ఇతర విభాగాలు పాల్గొన్నాయి. తీవ్రవాదులపై దాడి చేసేందుకు ఆర్మీ .. హెలికాప్టర్లు, డ్రోన్లను వాడి .. పక్కా ప్రణాళికతో శత్రువును మట్టుబెట్టాయి. గత రెండేళ్ల నుంచి మయన్మార్ లో కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ .. ఆరాకన్ ఆర్మీకి శిక్షణ ఇస్తోందని .. ముఖ్యంగా మిజోరం సరిహద్దుల్లో శిబిరాలు నెలకొల్పారని భారత భద్రతాదళ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ప్రాజెక్టే లక్ష్యంగా దాడికి వ్యుహరచన .? కౌంటర్ అటాక్

ప్రాజెక్టే లక్ష్యంగా దాడికి వ్యుహరచన .? కౌంటర్ అటాక్

ఐఈడీ బాంబు పేల్చడంలో ఉగ్రవాదులకు ఆరాకన్ ఆర్మీ శిక్షణ ఇచ్చిందని, ఇది ముఖ్యంగా ప్రాజెక్టును కూల్చేందుకు ట్రైనింగ్ ఇచ్చిందని అర్థమవుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్, మయన్మార్ ఉగ్ర మూకలను ఎరివేశాయి. అలాగే ఆరాకన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం చైనా సరిహద్దులోని కచిన్ రాష్ట్రం లైజాలో ఉంటుందని .. ఇది ఇండియా చైనా మయన్మార్ సరిహద్దు కేంద్రమని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+