ఎవరీ అవివా బేగ్? ప్రియాంక గాంధీ కాబోయే కోడలి ప్రొఫైల్ ఇదే!
దేశంలోనే పెద్ద రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా పేరున్న గాంధీ-వాద్రా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ-రాబర్ట్ వాద్రాల కుమారుడు రెహాన్ వాద్రా తన చిరకాల ప్రేయసి అవివా బేగ్‌తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తుండడంతో.. అసలు ఎవరీ అవివా బేగ్? ఆమె నేపథ్యం ఏమిటీ? అనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
అవివా బేగ్ ఎవరు?
అవివా బేగ్ కేవలం ఓ ప్రముఖ కుటుంబానికి కోడలిగా మాత్రమే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఢిల్లీకి చెందిన అవివా బేగ్ వృత్తిరీత్తా అద్భుతమైన ఫోటోగ్రాఫర్, మంచి ఆర్టిస్టు. ఢిల్లీలోని 'మోడరన్ స్కూల్'లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె.. హర్యానాలోని సోనేపట్‌లో ఉన్న ప్రఖ్యాత 'ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ' నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందారు. చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి ఉన్న అవివా బేగ్.. ఫోటోగ్రఫీని తన కెరీర్‌గా ఎంచుకున్నారు.

కెరీర్, విజయాలు
వృత్తిపరంగా అవివా బేగ్ ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె ప్రస్తుతం 'Atelier 11' అనే ఫోటోగ్రఫీ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్రాండ్లు, ఏజెన్సీలతో ఆమె సంస్థ పనిచేస్తోంది. అవివా బేగ్ తీసిన ఫోటోలు కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, కళాత్మక విలువలను కలిగి ఉండి అనేక జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో ప్రదర్శించబడ్డాయి. ఆర్టిస్ట్‌గానే కాకుండా ఆమె ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా కావడం విశేషం.
వాద్రా కుటుంబంతో ఉన్న అనుబంధం
రెహాన్ వాద్రా, అవివా బేగ్ కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవివా బేగ్ తండ్రి ఇమ్రాన్ బేగ్ ప్రముఖ వ్యాపారవేత్త కాగా.. ఆమె తల్లి నందిత బేగ్ ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన 'ఇందిరా భవన్' ఇంటీరియర్ పనుల్లో నందిత బేగ్ కీలక పాత్ర పోషించారు. ఈ కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే రెహాన్, అవివాల పరిచయం ప్రేమగా మారింది.
ఏడేళ్ల నిశ్శబ్ద ప్రేమ.. పెళ్లికి సిద్ధం
రెహాన్, అవివా గత ఏడేళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ఒకే రకమైన అభిరుచులు ఉండటం విశేషం. రెహాన్ వాద్రా కూడా అద్భుతమైన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడంతో, కళ, ప్రకృతి పట్ల ఇద్దరికీ ఉన్న ఉమ్మడి ఆసక్తి వీరి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవల రెహాన్ తన ప్రేమను వ్యక్తం చేయగా.. అవివా వెంటనే అంగీకారం తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2026లో రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరగబోతున్నట్లు సమాచారం.గాంధీ కుటుంబంలోకి ఒక ఆర్టిస్టు కోడలిగా రాబోతుండటం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ప్రైవేట్ లైఫ్ గడపడానికి ఇష్టపడే ఈ జంట త్వరలోనే అధికారికంగా పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications