రాజకీయాలంటే మక్కువ, పోటీ: ఎవరీ రాజస్థాన్ గజేంద్ర సింగ్?
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ ఎన్నికల్లోను పోటీ చేశాడు. అతనికి పది ఎకరాల వ్యవసాయం ఉంది. టేక్ ప్లాంటేషన్, వివిధ పండ్ల రకాలను అతను పండిస్తుంటాడు. అయితే, అతని మనస్సు మాత్రం వ్యవసాయంపై లేనట్లుగా తెలుస్తోంది.
అతను 2008లో, 2013 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అతను సమాజ్ వాది పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత అతను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఆత్మహత్యకు మూడు నాలుగు రోజుల ముందే అతను గ్రామాన్ని వదిలేశాడు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడని ఆత్మహత్య చేసుకున్న రైతు అల్లుడు చెప్పారు. తాను ఢిల్లీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తన సోదరుడితో కలిసి ఉంటానని చెప్పాడు.

గజేంద్ర సింగ్ గ్రామం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజస్థాన్ అచ్చం రాజస్థానీ వ్యక్తిలా ఉంటాడు. అతను రాజస్థానీ స్టైల్ తలపాగాను చాలా వేగంగా చుట్టుకుంటాడు. అంతేకాదు, వివిధ కొత్త పద్ధతుల్లో చుడుతాడు. అతను రాజకీయ ర్యాలీల్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటాడు.
చాలా ఎమోషనల్
గజేంద్ర సింగ్ సహజంగా ఎమోషనల్ అని చెబుతున్నారు. రాజకీయాల్లో తిరుగుతుంటాడని ఓ స్నేహితుడు చెప్పారు. గతంలోను అతను కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రాజకీయ నేపథ్యం
రాజస్థాన్‌లోని దౌసా జిల్లా నంగాల్ జమల్వరణ్ గ్రామానికి చెందిన గజేంద్ర సింగ్ జైపూర్‌లో ఉంటున్నారు. ఇతనిని తండ్రి ఇంటి నుండి గెంటి వేశాడని తెలుస్తోంది. అయినప్పటికీ గజేంద్ర సింగ్ తన గ్రామ సర్పంచ్, ఇతర కాంగ్రెస్ నేతలతో నిత్యం టచ్‌లో ఉండేవాడు. ఏఏపీతో అతని సంబంధం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి
గజేంద్ర సింగ్‌కు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. ఇతనికి, ఇతని తండ్రికి, సోదరులకు కలిసి ల్యాండ్ చాలానే ఉంది. ఇతనికి స్వయంగా దాదాపు పదెకరాల వ్యవసాయం ఉంది. అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వచ్చింది. అతనికి ఎలాంటి కంపెన్సేషన్ రాలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకు 33 శాతం పంట నష్టం ఉండాలి. కానీ అతని పంట నష్టం 24 శాతంగా ఉంది.
బిల్ క్లింటన్‌కు తలపాగా చుట్టాడు
గజేంద్ర సింగ్ 2003లో బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్పీలో చేరారు. అనంతరం ఏఏపీకి మద్దతుగా ఉంటున్నారు. జైపూర్‌లో పర్యాటకులకు రాజస్థాన్ సంప్రదాయ తలపాగా చుట్టేవాడు. అలా వచ్చిన డబ్బులతో జీవించేవాడు. సెకండ్లలోనే తలపాగా చుట్టేవాడు. బిల్ క్లింట్ 2000 సంవత్సరంలో రాజస్థాన్‌లో పర్యటించినప్పుడు ఆయనకు తలపాగా చుట్టారు.
హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కూడా తలపాగా చుట్టిన ఫోటోలను ఆయన మిత్రులకు చూపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లేలా కృషి చేస్తానని ఢిల్లీకి వెళ్లే ముందు గ్రామస్థులకు చెప్పాడు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేకున్నప్పటికీ కుటుంబ సమస్యలు ఉన్నాయని పలుమార్లు ఇల్లు విడిచి వెళ్లేవాడు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications