వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ గిరీశ్ చంద్ర, రాధాకృష్ణ మాథూర్..?? వారికే ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవులు

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్రప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్‌గా ట్రాన్స్‌ఫర్ చేసింది. మిజోరాం గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్‌ను నియమించారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి గిరిష్ చంద్రను, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాధాకృష్ణ మాథూర్‌ను లెప్టినెంట్ గవర్నర్లుగా నియమించారు. ఇంతకీ గిరిష్ చంద్ర, రాధాకృష్ణ నేపథ్యమేంటీ ?

1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరీశ్.. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వశాఖలో ఎక్స్‌పెండిచర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ క్యాడర్ కావడంతో మోడీతో సన్నిహిత్యం ఉంది. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కీలకమైన ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించారు. దీంతోపాటు చీఫ్ ఇన్మర్మేషన్ కమిషనర్‌గా పనిచేశారు.

who is girish chandra, radhakrishna

మాజీ ఐఏఎస్ అధికారి రాధాకృష్ణ మాథూర్ కూడా సమర్థులు. రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 1977 త్రిపుర క్యాడర్ ఐఏఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. 2018లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అధిపతిగా పనిచేశారు. ఆ పదవీలోనే రిటైరయ్యారు. దీంతోపాటు త్రిపురలో పలు ఉన్నత పదవులు కూడా పనిచేశారు.

వీరిద్దరూ రిటైర్డ్ ఐఏఎస్‌లు కావడం విశేషం. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో విధులంటే మాములు విషయం కాదు. అందుకే సమర్థత ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గిరీశ్.. కీలక శాఖలో పనిచేయగా.. మాథూర్ రక్షణశాఖలో విధులు నిర్వర్తించారు. సమర్థత ఆధారంగా కీలక బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించినట్టు తెలుస్తోంది.

English summary
IAS officer Girish Chandra Murmu 1985-batch IAS officer with a reputation for industriousness, he currently holds the post of Expenditure Secretary in the finance ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X