• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కౌన్ బనేగా మరాఠా సీఎం, రేసులో పవార్, థాకరే.. పవార్‌కే పవారా..? రాష్ట్రపతి పాలనే శరణమ్యా...?

|

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు సినిమా ట్వీస్ట్లను తలపిస్తోన్నాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో, శివసేక సీఎం పోస్టు కోసం మెలిక పెట్టడంతో... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని బీజేపీ గవర్నర్ భగత్‌సింగ్‌కు సమాచారం అందించింది. ఇప్పుడు గవర్నర్ ఏం చేయనున్నారు..? కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ఆహ్వానిస్తారా ? లేదంటే రాష్ర్టపతి పాలనకే మొగ్గుచూపుతారా ? వాట్ నెక్ట్స్..? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

క్షణ క్షణం ఉత్కం

క్షణ క్షణం ఉత్కం

మహారాష్ట్ర పాలిటిక్స్ క్షణానికో మలుపు, నిమిషానికో ట్విస్ట్ నెలకొంటుంది. సోమవారం లోగా బలాన్ని నిరూపించుకోవాలని బీజీపీకి గవర్నర్ భగత్‌సింగ్ సమయమిచ్చారు. కానీ శివసేన మెట్టు దిగకపోవడంతో ఆ పార్టీ ముందే అస్త్రసన్యాసం చేసింది. దీంతో మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే చర్చ జరుగుతుంది. బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న శివసేన.. తెరపైకి శరద్ పవార్ పేరు తీసుకొచ్చింది.

 పవార్‌కే పవారా..?

పవార్‌కే పవారా..?

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు కావాలి. ఎన్సీపీ 54, శివసేన 56, కాంగ్రెస్ 44 సీట్లతో అదీ 155 సీట్లకు చేరుతుంది. ఈ కూటమి అధికారం చేపట్టబోవడం నల్లేరు మీద నడకే. కానీ కాంగ్రెస్-ఎన్సీపీలతో శివసేన జట్టుకడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శివసేనకు వ్యతిరేకంగా ఎన్సీపీ పనిచేస్తోంది. మహారాష్ట్రలో రాజకీయం పీక్‌కి చేరినా పవార్.. ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడలేదు. శివసేన చొరవ తీసుకొని సీఎం పదవీ చేపట్టాలని కోరుతుంది.

పవార్ రియాక్షన్ ఏంటో..

పవార్ రియాక్షన్ ఏంటో..

శివసేన ప్రతిపాదనకు పవార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదివరకే తాను సీఎం పదవీ చేపట్టబోనని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూటమితో చర్చలు జరిపి సీఎం పీఠం అధిష్టిస్తారా ? లేదంటే నో అంటారా అనే చర్చ కూడా జరుగుతుంది. కూటమి ఏర్పడి పవార్ నో అంటే అనే డిస్కషన్ కూడా జోరుగా జరుగుతుంది.

తెరపైకి ఆదిత్య

తెరపైకి ఆదిత్య

మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయి.. పవార్ సీఎం పదవీ వద్దంటే.. తెరపైకి ఆదిత్య థాకరే పేరు వస్తోంది. వాస్తవానికి సీఎం పదవీ అధిష్టించాలనే ఆదిత్య ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దిగారు. అందుకోసమే ఎన్నికల్లో పోటీచేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం పోస్టు చేరి రెండున్నరేళ్లు అని బీజేపీ చెప్పిందని ఉద్దవ్ పదే పదే గుర్తుచేస్తున్నారు. కానీ బీజేపీ అలాంటిదేమీ లేదని చెప్పడంతో.. వారి బంధానికి బీటలు పారాయి. ఈ త్రయంలో పవార్ వద్దంటే మొదట వినిపించే పేరు ఆదిత్య థాకరే.

రాష్ట్రపతి పాలనే..

రాష్ట్రపతి పాలనే..

గవర్నర్ తన విచక్షణాధికారంతో కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరితే ఓకే.. లేదంటే రాష్ట్రపతి పాలనే శరణ్యం. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి నివేదించి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. కొన్నాళ్లలో చర్చలు జరిపి.. అన్నీ పార్టీలు సానుకూలంగా ఉంటే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాంగ్రెస్ కూటమిని ఆహ్వానిస్తే.. సీఎం పదవీ ఎవరు చేపడుతారోనని చర్చ జరుగుతుంది. కూటమి ఏర్పడిన ఇందులో లుకలుకలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

English summary
who is maharashtra chief minister. sharad power or adithya..?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X