పంతం పట్టి కూర్చున్న ఏక్‌నాథ్ షిండే

Maharashtra : మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటి కూటమి విజయదుందుభి మోగించింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

ఇంత భారీ మెజారిటీతో

మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. ఈ కూటమి అభ్యర్థులు 230 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. ఓ అధికార కూటమి ఇంత భారీ మెజారిటీతో గెలుపొందడం ఇదే తొలిసారి.

Who is new Maharashtra CM Shiv Sainiks organised prayer meets in temples for Eknath Shinde

సీట్లివీ..

బీజేపీ 149 సీట్లల్లో పోటీ చేసి132 చోట్ల విజయం సాధించింది. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మూడు పార్టీల ఓటుబ్యాంకు అమాంతం పెరిగింది.

నో మేజిక్ ఫిగర్

ఈ కూటమిలో ఏ ఒక్క పార్టీకి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా పరస్పరం సహకరించుకోగలిగితేనే వరుసగా రెండోసారి మహాయుటి అధికారంలోకి రాగలుగుతుంది.

మూడు రోజులు గడుస్తోన్నప్పటికీ..

ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. హస్తినలో మకాం వేస్తోన్నారు. ఈ మూడు రోజుల్లో పలుమార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశం అయ్యారు.

Who is new Maharashtra CM Shiv Sainiks organised prayer meets in temples for Eknath Shinde

రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం..

వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టి కూర్చుంది. బీజేపీ అయినా సరే- సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. రెండో దఫా తమ పార్టీ అధినేతనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోంది.

Who is new Maharashtra CM Shiv Sainiks organised prayer meets in temples for Eknath Shinde

పెద్ద ఎత్తున ఆలయాల్లో పూజలు..

ఈ క్రమంలో- శివసేన నాయకులు, కార్యకర్తలు, షిండే అభిమానులు పెద్ద ఎత్తున ఆలయాల్లో పూజలు చేశారు. కొన్ని చోట్ల ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి యజ్ఞయాగాదులను నిర్వహించారు. బీజేపీ పెద్దల మనసు మార్చేలా చేయాలంటూ ప్రార్థించారు. షిండే సొంత జిల్లా థానెతో పాటు ముంబై, రత్నగిరి, నాసిక్ వంటి శివసేనకు పట్టువున్న జిల్లాల్లో ఈ పూజలు పెద్ద ఎత్తున సాగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+