Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిత్యానంద ‘కైలాస’ దేశ ప్రతినిధిగా యూఎన్ మీట్‌లో హల్‌చల్: ఎవరీ విజయప్రియ?

కైలాస దేశం నుంచి ఐక్యరాజ్యసమితికి ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి కైలాస (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస-యూఎస్‌కే) అనే పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. అయితే, తాజాగా, ఈ దేశం నుంచి ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి కూడా హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిత్యానంద కైలాస ప్రతినిధిగా యూఎన్ మీట్‌లో విజయప్రియ

నిత్యానంద కైలాస ప్రతినిధిగా యూఎన్ మీట్‌లో విజయప్రియ

ఫిబ్రవరిలో జరిగిన ఐక్యరాజ్యసమితి కీలక సమావేశంలో కైలాస దేశ ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద అనే మహిళ హాజరయ్యారు. ఆమెతోపాటు పలువురు మహిళా ప్రతినిధులు వచ్చినప్పటికీ.. ఐక్యరాజ్యసమితి సమావేశంలో విజయప్రియ ప్రసంగం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR) నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. "హిందూ మతం అత్యున్నత పోప్టిఫ్" కోసం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూమతంలోని ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని, ఆయన పుట్టిన దేశం(భారత్) నుంచి నిషేధించారని ఆమె వ్యాఖ్యానించారు.

ఎవరీ విజయప్రియ నిత్యానంద?

ఎవరీ విజయప్రియ నిత్యానంద?

ఐక్యరాజ్యసమితి సమావేశానికి విజయప్రియ నిత్యానంద చీరలో హాజరయ్యారు. తలకు తలపాగా, ఆభరణాలు కూడా ధరించారు. ఇక ఆమె తనకు తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి చెందిన శాశ్వత రాయబారిగా పరిచయం చేసుకున్నారు. ఫేస్‌బుక్ ప్రొపైల్ ప్రకారం.. ఆమె వాషింగ్టన్‌ డీసీలో నివాసం ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె పలు ఫొటోలను కూడా పోస్టు చేశారు. నిత్యానందకు చెందిన చిత్రాన్ని కుడిచేతిపై టాటూగా వేసుకున్నారు

విజయప్రియ నిత్యానంద ఏం చేశారంటే..?

విజయప్రియ నిత్యానంద ఏం చేశారంటే..?

ఇక లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. విజయప్రియ మనిటోబా యూనివర్సిటీలో మైక్రోబయోలాజీ బీఎస్సీ హానర్ చేశారు. జూన్ 2014లో యూనివర్సిటీ డీన్స్ హానర్ లిస్ట్‌లో ఆమె ఉన్నారు. ఆమెకు ఇంగ్లీష్, ఫ్రెంఛ్, హిందీ, క్రోలీ, పిడ్జింగ్(ఫ్రెంచ్ సంబంధిత) భాషలు తెలుసు. కైలాసకు సంబంధించిన వెబ్‌సైట్ కూడా ఆమె తమ దేశం కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. ఐక్యరాజ్యసమితికి హారైన విజయప్రియ పలువురితో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు సమాచారం. కాగా, 150కిపైగా దేశాల్లో తమకు ఎన్జీవో సంస్థలు, కార్యాలయాలు ఉన్నాయని కైలాస్ వెబ్‌సైట్ పేర్కొంటోంది.

విజయప్రియ వాదనలపై యూఎన్ స్పందనేంటి?

ఐక్యరాజ్యసమితిలో పాల్గొని విజయప్రియ మాట్లాడినప్పటికీ.. యూఎన్ మాత్రం ఆమె మాటలను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఈ మేరకు బీబీసీతో యూఎన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గుర్తింపు లేని దేశం తరపున చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేదని తెలిపారు. ఆమె వ్యాఖ్యల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, తొలిసారిగా కైలాస దేశం తరపున ఐక్యరాజ్యసమితిలో పాల్గొని మాట్లాడటం ప్రపంచంతోపాటు భారత్ ను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యానందను దేశం నుంచి బహిష్కరించారంటూ భారత్‌పై ఆరోపణలు చేశారు విజయప్రియ. అయితే, ఆమె వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించలేదు.

కైలాస దేశం ఎక్కడుందంటే?

కైలాస దేశం ఎక్కడుందంటే?

అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదవడంతో నిత్యానంద భారతదేశం విడిచిపారిపోయిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలను నిత్యానంద కొట్టిపారేశారు. ఆ తర్వాత 2019లో ఈక్వెడార్ సమీపంలోని తీరంలో ఓ ద్వీపాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. దానికే కైలాస అనే పేరు పెట్టి దేశంగా చెప్పుకొచ్చాడు. అయితే, ఈక్వెడార్ మాత్రం తమ దేశంలో నిత్యానంద లేడని స్పష్టం చేసింది. కాగా, 2019 నుంచి నిత్యానంత బహిరంగంగా ప్రజలకు కనిపించకపోవడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+