VK Pandian: ఎవరీ వీకే పాండియన్ ? తమిళనాడు నుంచి వచ్చి ఒడిశాను లీడర్ గా నిలిపిన మేథావి..
రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మీడియాలో వీకే పాండియన్ పేరే వినిపిస్తోంది. మాటల కంటే చేతలే మిన్నగా భావించే ఒడిశా ఐదోసారి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న వీకే పాండియన్ నిన్న తన పదవికి స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించడం చకచగా జరిగిపోయాయి. అయితే అంతకంటే మిన్నగా కేబినెట్ మంత్రి హోదా ఉన్న రెండు కీలక పదవుల్లో సీఎం నవీన్ ఆయన్ను నియమించడంతో ఇప్పుడు ఆయన పేరు మార్మోగుతోంది.
దేశంలో ఒకప్పుడు ఒడిశా గురించి మాట్లాడాలంటే వెనుకబడ్డ రాష్ట్రం అనేవారు. ఆ పరిస్దితి నుంచి ఇప్పుడు దేశంలో ఎన్నో రంగాల్లో మేటిగా నిలిచి, ఓ విధంగా చెప్పాలంటే లీడర్ గా మారిపోయిన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. ఈ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాలలో ఒడిశా సామాజిక, ఆర్థిక రంగాలలో కొత్త శిఖరాలకు చేరింది. సాంకేతికత, కొత్త ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించడంతో రాష్ట్రం పేద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుండి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వానికి మరియు ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుకు రాష్ట్రం ఓ నిదర్శనం. దీంతో ప్రజలు వరుసగా ఐదోసారి నవీన్ కే జై కొట్టారు.

అయితే ఈ మార్పు వెనుక నవీన్ పట్నాయక్ ఎంచుకున్న ఓ వ్యక్తి పోషించిన పాత్ర అమూల్యమైనది. అతనే వీకే పాండియన్.ప్రతీ ముఖ్యమంత్రి దగ్గర వ్యక్తిగత కార్యదర్శులు ఉంటారు. వారు సీఎంలు చెప్పిన కొన్ని పనులకే పరిమితం అవుతారు. కానీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వరకూ వచ్చిన వీకే పాండియన్ ప్రయాణం, అలాగే సీఎం వద్దకు వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన మార్పులు ఒడిశాను లీడర్ గా నిలిపే స్ధాయికి తీసుకెళ్లాయంటే ఈ పాండియన్ గొప్పతనం ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్-కలెక్టర్‌గా చేరినప్పుడు ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న చర్యలతో వెలుగులోకి వచ్చారు.మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసి రైతులకు కనీస మద్దతుధరలు, సహకార సంఘాలకు లాభాలు వచ్చేలా చేశారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. అప్పుడే తొలిసారిగా సీఎం నవీన్ దృష్టిలో పడ్డారు.

రూర్కెలా ఏడీఎంగా పాండియన్ చెండ్ మార్కెట్ తొలగింపు, ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్ గా మారుమూల గ్రామాలకు ఆయన రోజువారీ పర్యటనలు అభివృద్ధిని పరుగులు తీయించాయి. పిడబ్ల్యుడిల సాధికారత కోసం ఆయన తెచ్చిన సింగిల్ విండో విధానం జాతీయ నమూనాగా దేశవ్యాప్తంగా అమలవుతోంది. వికలాంగుల పునరావాసం కోసం చేసిన కృషికి మయూర్‌భంజ్ జాతీయ అవార్డును అందుకున్నారు. అభివృద్ధితో నక్సలిజం రూపుమారి హెలెన్ కెల్లర్ అవార్డు కూడా తీసుకున్నారు.
ఆ తర్వాత వీకే పాండియన్ అత్యధికత జనాభా కలిగిన గంజాం కలెక్టర్ గా రెండుసార్లు ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ అవార్డు అందుకున్నారు. గంజాం జిల్లాలో ఉపాధి హామీ వేతనాల బ్యాంకు చెల్లింపులతో విప్లవాత్మక విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇది ఒడిశాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కేంద్రానికి రోల్ మోడల్ గా మారింది. దీంతో రెండుసార్లు రాష్ట్రపతి అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. వీకే పాండియన్ నేతృత్వంలోనే హెచ్‌ఐవి సోకిన వ్యక్తులకు పునరావాసం కోసం చేసిన కృషికి జాతీయ అవార్డు అందుకున్నారు.

2011 సంవత్సరంలో వి కె పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకున్నారు. నవీన్‌కి ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత వీకే పాండియన్‌తో పాటు రాష్ట్రం కూడా వెనుదిరిగి చూసుకోలేదు. సిఎం నవీన్ పాండియన్‌లో దూరదృష్టి , కష్టపడి పనిచేసే తత్వం నవీన్ ను ఆకట్టుకుంది. నవీన్ పట్నాయక్ ఊహించిన విధంగా 5T ఇనిషియేటివ్స్ ద్వారా ఒడిశా పరివర్తన మార్గంలోకి వెళ్లడంతో, VK పాండియన్ కొత్త ఒడిషాకు క్యూరేటర్ గా మారారాు. నవీన్ , వి కె పాండియన్ ఇద్దరూ సామాన్యులను పాలనకు కేంద్ర బిందువుగా మార్చడానికి కృషి చేస్తున్నారు.
5T ఇనిషియేటివ్ ల ద్వారా ఇప్పుడు ఒడిశా అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇది వీకే పాండియన్ తోనే సాధ్యమైంది. దీని ఫలితాలు రాష్ట్రానికి అందుతున్నాయి. 2018లో ప్రారంభించబడిన 5T ఇనిషియేటివ్‌లు రాష్ట్రాన్ని పరిపాలించే విధానాన్ని మారుస్తున్నాయి. దీంతో ఒడిశాలో సామాన్యుడు పరిపాలనకు కేంద్ర బిందువుగా మారాడు. రాష్ఠ్రంలో ఇప్పుడు మో సర్కార్, చారిత్రక, మతపరమైన స్థలాల అభివృద్ధి, పూరీలోని హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్, 5T హైస్కూల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్, ఒడిషాను భారత క్రీడా కేంద్రంగా మార్చడం, గత కొన్ని సంవత్సరాల్లో ఒడిశా పాలనలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు.

అలాగే ఒడిశా కోవిడ్-19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవడంలోనూ పాండియన్ పాత్ర ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో అతి తక్కువ ప్రాణనష్టం జరిగిన కొన్ని రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఒడిశా రికార్డు సమయంలో దేశంలో అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం ద్వారా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది. రాష్ట్రంలో హైస్కూల్ పరివర్తన కార్యక్రమం కింద 6500 పైగా ఉన్నత పాఠశాలల రూపురేఖలు మారాయి. రాష్ట్రంలో SCB మెడికల్ కాలేజ్, హాస్పిటల్ దేశంలోనే అతిపెద్దదిగా భావించబడే ఎయిమ్స్ ప్లస్ కేటగిరీ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ స్ధాయికి చేరింది.
మేక్ ఇన్ ఒడిషా కాన్‌క్లేవ్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఒడిశా సాధించిందంటే దాని వెనుక పాండియన్ కృషి ఎంతో ఉంది. క్రియాశీల పారిశ్రామిక విధానాలు రాష్ట్రాన్ని భారతదేశ ఉత్పత్తి రాజధానిగా మార్చాయి. ప్రజల సంక్షేమం కోసం ఒడిశా చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం , అంతర్జాతీయ ఏజెన్సీలు గుర్తించాయి. రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన వీకే పాండియన్ పై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఉన్న విశ్వాసం ఇప్పుడు ఆయన్ను కార్యదర్శి పదవి నుంచి ఏకంగా 5టీ కార్యక్రమానికి, నబీ ఒడిశా కార్యక్రమానికీ ఛైర్మన్ గా నియమించేలా చేశాయి. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన పాండియన్ పై ఎంతో నమ్మకంతో సీఎం నవీన్ ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications