వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెసర్ ఎప్పుడయ్యారు?: ములాయంపై నితీష్ సెటైర్

|
Google Oneindia TeluguNews

పాట్నా: నిన్న మొన్నటి దాకా మేమంతా ఒక్కటే అన్న నాయకులు ఈరోజు తమ దారి తాము చూసుకున్నారు. అంతేగాక, ఒకరిపై ఒకరు విమర్శలు కూడా తీవ్రంగా చేసుకుంటున్నారు.

ఇటీవలే మహాకూటమి(జనతా పరివార్)గా ఏర్పడి విడిపోయిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించే ఈ ఉపోద్ఘాతం. ప్రస్తుతానికి ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆ కూటమిలోనే ఉన్నారు.

కాగా, లౌకికవాదానికి ములాయం సింగ్ యాదవ్‌ ప్రొఫెసర్‌ ఎప్పుడయ్యారు? ఆయణ్ని ఎవరు తయారు చేశారు? అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన ప్రొఫెసర్ అయితే, తామంతా పరిశోధన విద్యార్థులమా? అని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.

Who Made Him Professor of Secularism? Nitish Kumar on Ex-Ally Mulayam

మంగళవారం ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ములాయం లౌకిక వాద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయితే, మేమంతా రీసెర్చ్ స్కాలర్సా' అని ప్రశ్నించారు.

ఇది ఇలా ఉండగా, గతవారం ఓ కార్యక్రమంలో ములాయం మాట్లాడుతూ.. నితీష్‌పై విమర్శలు కురిపించారు. పరోక్షంగా నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి.. ‘ఎవరు లౌకికవాది? పన్నేండుళ్లుగా బిజెపి మద్దతు తీసుకొని పరిపాలన సాగించిన వీరు లౌకిక వాదులా? అదేంటో ఒక్కసారిగా వారంతా లౌకికవాదులుగా మారారు' అంటూ ధ్వజమెత్తారు. ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని తాజాగా నితీశ్ ఎదురు దాడికి దిగారు.

English summary
Partners till three weeks ago, politicians Mulayam Singh Yadav and Nitish Kumar are now unburdening themselves of angry accusations against each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X