దేశంలో విడాకులు తీసుకున్న మొదటి మహిళ ఎవరో తెలుసా..?
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. అయితే మన దేశంలో మొదటగా విడాకులు తీసుకున్న మహిళ ఎవరో తెలుసా..? ఆ మహిళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.రుఖ్మాబాయి రౌత్ భారతదేశంలో మొట్టమొదటి విడాకులు తీసుకున్న హిందూ మహిళ. ఆమె బాల్య వివాహం తిరస్కరించి, విడాకుల కోసం పోరాడింది.
ఆమె విడాకుల కేసులో స్వయంగా బ్రిటన్ క్వీన్ జోక్యం చేసుకొని ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. రుఖ్మాబాయి రౌత్ 1864 నవంబర్ 22న జన్మించారు. ఆమె 11 ఏళ్ల వయసులోనే 19 ఏళ్ల దాదాజీ భికాజీతో వివాహం జరిగింది. అయితే, రుఖ్మాబాయి చదువుకోవాలనే తపనతో వివాహ బంధాన్ని వదులుకుంది. ఎన్నో విమర్శలు ఎదురైనా సరే మహిళల హక్కుల కోసం పోరాడింది. ఆమె కేసులో బ్రిటీష్ క్వీన్ విక్టోరియా జోక్యం చేసుకున్నారు.1885లో ఆమెకు విడాకులు లభించాయి.

రుఖ్మాబాయి రౌత్ విడాకులు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్‌లో వైద్యం చదివి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా పేరుగాంచారు. ఆమె 35 సంవత్సరాల పాటు రాజ్‌కోట్‌లోని మహిళా ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. రుఖ్మాబాయి రౌత్ మహిళల హక్కుల కోసం పోరాడిన ధీరవతి. ఆమె విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె మహిళల విద్య, ఆరోగ్యం కోసం కృషి చేశారు. రుఖ్మాబాయి రౌత్ మహిళలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి.












Click it and Unblock the Notifications