BJP: బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడు ఎవరు?.. రేసులో ఉన్నవారు వీరే..!
BJP: భారతీయ జనతా పార్టీ త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాబోయే నెలల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ వంటి దక్షిణ భారత రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుందని ఈ నిర్ణయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. సీఎం అయినా పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక అయినా.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ నిర్ణయాలను అంచనా వేయడం చాలా కష్టం. అయితే అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉన్న అభ్యర్థుల గురించి తెలుసుకుందాం.
బీజేపీ జాతీయాధ్యక్షుడి పదవి కోసం కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో జి.కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, డి.పురంధేశ్వరి, వానతి శ్రీనివాసన్ పేర్లు మాత్రమే కాకుండా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని జాతీయాధ్యక్షుడి పదవికి ఎందుకు ఎంపిక చేస్తారో విశ్లేషిద్దాం. మొదటి కీలక అంశం ఏమిటంటే ప్రాంతం. ప్రాంతం ఆధారంగా జాతీయాధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంటుంది. త్వరలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరగనున్న తరుణంలో దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా అనే సందిగ్ధం కలుగుతోంది. రెండో అంశం లింగం. బీజేపీకి ఇప్పటివరకు మహిళా జాతీయాధ్యక్షులు లేరు. మోడీ ప్రభుత్వం మొదటి సారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చింది. ఆ తర్వాత ఢిల్లీకి కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిని ఇచ్చింది. ఈ క్రమంలో ఈ సారి మహిళా జాతీయాధ్యక్షురాలిని నియమిస్తారా అనే అనుమానం కలుగుతోంది.

మూడో అంశం విధేయత, సంస్థాగత అనుభవం. పార్టీ వ్యవహారాలు అన్ని తెలిసి ఉన్న వ్యక్తితో పాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న వ్యక్తులకు ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ కీలక బాధ్యతను అప్పగించే అవకాశం ఉంటుంది. నాలుగో అంశం ఆర్ఎస్ఎస్ ఆమోదం. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలలో పార్టీ విజయంలో సహకరించిన , ముఖ్యమంత్రి ఎంపికలో కీలక పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్ ఆమోదం కూడా బీజేపీ జాతీయాధ్యక్షుడి తుది ఎంపికకు కీలకం అవుతుంది.
పోటీలో ఉన్న పేర్ల గురించి చర్చిద్దాం..
జి కిషన్ రెడ్డి: దక్షిణాది నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడిని ఎంపిక చేస్తే మొదటి స్థానంలో జి.కిషన్ రెడ్డి ఉంటారు. బీజేపీ చివరిసారిగా రెండు దశాబ్ధాల క్రితం దక్షిణ భారతం నుంచి జాతీయాధ్యక్షుడిని ఎంపిక చేసింది. ఏపీ నుంచి వెంకయ్యనాయుడు, అంతకుముందు దాదాపు ఒక సంవత్సరం పాటు దక్షిణాది నుంచి బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తిలను అధ్యక్షులుగా బీజేపీ నియమించింది. కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్నారు. గత 45 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు. భారత జనతా యువ మోర్చా అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పదవులను నిర్వహించారు. ఆయన తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. అంతకు ముందు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన సంగతి తెలిసిందే. బీజేపీ దక్షిణాదిలో విస్తరించాలని చూస్తోంది. కాబట్టి దక్షిణాది నుంచి జాతీయాధ్యక్షుడిని ఎంపిక చేయడం తెలివైన పని. మరో విషయం ఏంటంటే.. కిషన్ రెడ్డికి ప్రధాని మోడీతో చాలా అనుబంధం ఉంది. ఇద్దరూ 1993లో అమెరికాను సందర్శించారు.
ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్:
ఈ ఇద్దరూ ప్రధాని మోడీకి, అమిత్ షాకు సన్నిహితులు కావడంతో పాటు బీజేపీకి కీలక వ్యూహకర్తలుగా ఉన్నారు. ఇద్దరూ కేంద్ర మంత్రులు కూడా కావడం గమనార్హం. బీజేపీకి తూర్పు ప్రాంతం నుంచి ఎప్పుడూ అధ్యక్షుడు రాలేదు. 2024లో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ గెలుపు కోసం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కృషి ఎంతగానో ఉంది. ఈ విజయంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించినా ముఖ్యమంత్రి కాలేదు. ఆయన గత సంవత్సరం హర్యానాకు, 2022లో ఉత్తర ప్రదేశ్ కు బాధ్యతలు స్వీకరించారు. రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ గెలిచింది. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ ఎటువంటి క్రెడిట్ కోరుకోరు. తన పని ఏంటో తాను చూసుకుంటూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తుంటారు. ఆయన తదుపరి బీజేపీ జాతీయాధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది.
భూపేంద్ర యాదవ్ స్వభావం, పని తీరు కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాగానే ఉంటాయి. బీజేపీకి మహారాష్ట్రలో చారిత్రాత్మక అందించడంలో భూపేంద్ర యాదవ్ కీలకంగా పనిచేశారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లో 2017లో పార్టీ విజయం సాధించడంలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారు. భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ కు చెందినవారు. ఈ సారి అజ్మీర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూపేంద్ర యాదవ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాగే సమర్థవంతమైన నిర్వాహకుడు. అందరినీ కలుపుకుని పోయే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
ఈ సారి మహిళా అధ్యక్షురాలు రానున్నారా?
ఈ సారి బీజేపీ మహిళా అధ్యక్షురాలిని చేయాలనుకుంటే బీజేపీ మహిళా మోర్చా చీఫ్ వానతి శ్రీనివాసన్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వానతి శ్రీనివాసన్ తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ ను ఓడించారు. వచ్చే ఏడాది కీలకమైన దక్షిణాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున.. వానతి శ్రీనివాసన్ పేరు కీలకంగా వినిపిస్తోంది. బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మరో మహిళ పేరు లోక్ సభ ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురంధేశ్వరి. చాలా మంది ఆమెను "దక్షిణాది సుష్మా స్వరాజ్ " అని కూడా పిలుస్తారు. ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె కూడా. ఆమె ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి సోదరి కూడా. చంద్రబాబు ఎన్డీయేకు కీలక మిత్రుడిగా కూడా ఉన్నారు. ఈ ఇద్దరు మహిళలు దక్షిణాది నుంచి వచ్చారు. ఇది ప్రాంతీయ పరంగా కలిసొచ్చే అంశం.
మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్:
కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్ లు కూడా ఈ జాతీయాధ్యక్షుడి బరిలో ఉన్నారు. వీరికి ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు. ప్రధానమంత్రి ఒకసారి హర్యానాలో ఖట్టర్ తో కలిసి సైకిల్ తొక్కడంతో పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా కూడా కలిసి పని చేశారు. మనోహర్ లాల్ ఖట్టర్ నిరాడంబరుడు, నిజాయితీపరుడు కాబట్టి ఆయనను హర్యానా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోడీ ఎంపిక చేసుకున్నారని కూడా భావిస్తారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎంపికలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉన్నందున.. ఖట్టర్ బలమైన అభ్యర్థి కావచ్చు. ఆయనకు ఉన్న ఏకైకై ప్రతికూల అంశం వయస్సు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు.
ఈ సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన చాలా సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 2023లో మధ్యప్రదేశ్ లో గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోబడ్డారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తన 13వ ఏటానే ఆర్ఎస్ఎస్ లో చేరిపోయారు. నిర్వహణలో ఎంతో అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇటీవల ప్రధాన మంత్రి కేంద్ర పథకాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. 66 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన పేరు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications