• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త సీఎంపై నెలకొన్న ఉత్కంఠ : మోడీ మొగ్గు ఎవరి వైపు?

|

న్యూఢిల్లీ : గుజరాత్ సీఎం ఆనందీ బెన్ రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు మూడు రోజుల్లోనే కొత్త సీఎం ఎంపిక ఖరారవుతుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సీఎం రేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

అయితే జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ వ్యవహారాలను చక్కదిద్దుతోన్న అమిత్ షా కు.. సీఎం బాధ్యతలు అప్పగించి గుజరాత్ కే పరిమితం చేయడానికి ప్రధాని మోడీ మొగ్గు చూపుతారా..? అన్నది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం గుజరాత్ లోని నారన్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమిత్ షా ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఇక అమిత్ షా తర్వాత రేసులో.. పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీఎంగా అమిత్ షా కు పగ్గాలు అప్పజెప్పకపోతే ఈ ఐదుగరిలో ఒకరిని సీఎం పదవి వరించడం ఖాయమన్న చర్చ జోరందుకుంది. అమిత్ షా కంటే సీనియరైన పురుషోత్తం రూపాల రేసులో మిగతావారికంటే ముందున్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంలోను మోడీ తర్వాత పురుషోత్తం ధిట్ట అనే పేరు కూడా ఉంది.

Who Will Succeed Anandiben as Next CM of Gujarat?

రాజకీయానుభవంలోను అమిత్ షా కంటే సీనియర్ అయిన పురుషోత్తం ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తోన్నా..! గడిచిన కొంతకాలంగా బీజేపీలో ఆయన ప్రభ తగ్గిపోయినట్లుగా చెప్పుకుంటారు. తాజాగా ఆనందీ బెన్ రాజీనామా ఆయనకు కలిసొచ్చి సీఎంగా గనుక బాధ్యతలు చేపడితే మళ్లీ ఆయన రాజకీయ ప్రభ పునర్వైభవం సంతరించుకునే అవకాశాలున్నాయి.

ప్రస్తుత గుజరాత్ రాజకీయాల్లో ఆనందీ బెన్ తర్వాత నంబర్ టూ గా కొనసాగుతూ వస్తోన్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ తో ఆయనకున్న సంబంధాలు సీఎం పదవికి ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక జైన్ సామాజిక వర్గానికి చెందిన గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా సీఎం అభ్యర్థుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ సంక్షోభాలను సమర్థవంతంగా చక్కదిద్దగలడన్న పేరు విజయ్ రూపానికి ఉండడం రేసులో ఆయనకు కలిసొచ్చే అంశం.

గుజరాత్ లో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య ప్రధాన అనుసంధానకర్తగా.. మోడీ సీఎంగా కొనసాగిన కాలంలో బలమైన నేతగా ముద్రవేసిన గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి భిక్షురాయ్ దాల్సానియా పేరు కూడా సీఎం అభ్యర్థుల జాబితాలో వినిపిస్తోంది. జాబితాలో వినిపిస్తోన్న పేర్లలో ఒక్క ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరికి మాత్రమే దాదాపుగా అవకాశాలు లేవని తెలుస్తున్నా.. మిగతావారి విషయంలో స్పష్టత లేదు. ఉత్కంఠగా మారిన కొత్త సీఎం చర్చకు బీజేపీ ఎలాంటి నిర్ణయంతో ముగింపు పలుకుతుందో తెలియాలంటే ఇంకో రెండు మూడు రోజులు వేచి చూడక తప్పదు.

English summary
Who will succeed Anandiben Patel? At least four names are doing the rounds. Party insiders rule out the possibility of national president of the BJP Amit Shah returning to Gujarat to succeed her as the next chief minister. It is stilll circulated as a possibility, but there are not many takers for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X