వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్ కు షాకిచ్చిన నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా, ట్విట్టర్ అకౌంట్ క్లోజ్, అందుకే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని పదేపదే విమర్శించి సోషల్ మీడియాలో హంగామా చేసిన ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా అలియాస్ దివ్యా స్పందన ఒక్క సారిగా ట్వీట్టర్ అకౌంట్ క్లోజ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కాలం గడిపిన రమ్యా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్టర్, ఇన్ స్టాగ్రాం అకౌంట్లకు గుడ్ బై చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

మొదటి సారి !

మొదటి సారి !

నటి రమ్యా ట్విట్లర్ అకౌంట్ కు గుడ్ బై చెప్పడం ఇది మొదటి సారికాదు. గత అక్టోబర్ నెలలో ఒక్కసారిగా ట్వీట్టర్ అకౌంట్ మాసివేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకుల తీరుతో నటి రమ్యా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని రోజుల తరువాత నటి రమ్యా తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యక్షం అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లి రమ్యా ట్విట్టర్ అకౌంట్ లో మాయం అయ్యారు.

రాజకీయాలకు బ్రేక్ ?

రాజకీయాలకు బ్రేక్ ?

నటి రమ్యా కేవలం సొంత ట్విట్టర్ అకౌంట్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా నుంచి దూరం అయ్యారని అదే పార్టీ నాయకులు అంటున్నారు. నటి రమ్యా రాజకీయాలకు కొంతకాలం దూరం కావాలని నిర్ణయించారని ఆ పార్టీకి చెందిన వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంలో నటి రమ్యా మత్రం క్లారిటీ ఇవ్వలేదు.

రమ్యా ఆప్తుడు !

రమ్యా ఆప్తుడు !

రమ్యా ట్విట్లర్ నుంచి బయటకు వచ్చిన కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీ అధికార సోషల్ మీడియా విభాగం ప్రముఖుడు చిరాగ్ పట్నాయక్ ఆయన ట్విట్టర్ అకౌంట్ కు గుడ్ బై చెప్పాడు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న చిరాగ్ పట్నాయక్ మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చిరాగ్ పట్నాయక్ తరువాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న రమ్యా తన మీద ఎక్కడ ఆరోపణలు వస్తాయో అనే ఆందోళతో ముందుగా ట్విట్టర్ అకౌంట్ కు గుడ్ బై చెప్పారని ప్రచారం జరుగుతోంది.

హై కమాండ్ ఆదేశం

హై కమాండ్ ఆదేశం

లోక్ సభ ఎన్నికల్లో అతి దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల రోజుల పాటు పార్టీకి చెందిన ప్రముఖులు, నాయకులు మీడియాతో మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. హై కమాండ్ ఆదేశాల మేరకు రమ్యా తన ట్విట్లర్ అకౌంట్ క్లోజ్ చేశారని పుకార్లు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల సమయంలో సాటి మహిళను (నిర్మలా సీతారామన్) సైతం సోషల్ మీడియాలో విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన నటి రమ్యా ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చారు.

English summary
Why actresses Ramya aka Divya Spandana deleted her Twitter and instagram profiles? Is she taking break from politics? Here are the details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X