ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు ఎందుకు ఆపారు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న - Newsreel
ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులలో నిలిపివేస్తుండడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇలాంటి విపత్కర సమయంలో మానవత్వం లేకుండా అంబులెన్సులు ఆపేయడం ఏమిటని ప్రశ్నించింది.

ఏ అధికారంతో అంబులెన్సులను రానివ్వకుండా అడ్డుకున్నారని ప్రశ్నించింది.
మరోవైపు తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
సామూహిక ప్రార్థనలలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
రంజాన్ తరువాత చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించినా అది సక్రమంగా అమలు కావడం లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
కోర్టు ఆదేశాలను పక్కనపెడితే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాగా ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంతో సమావేశమవుతున్నారని.. నైట్‌కర్ఫ్యూ పొడిగింపు, లాక్‌డౌన్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారని ఏజీ కోర్టుకు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- సబ్బం హరి: అనకాపల్లి మాజీ ఎంపీ మృతి
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: 'మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’.. ఐసీయూలో పనిచేసే ఓ నర్సు అనుభవాలు
- దీర్ఘకాలిక కోవిడ్: 'రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్‌డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications