తెలుగు రాష్ట్రాలకు డిసెంబర్ టెన్షన్ ? టర్నింగ్ పాయింట్ కాబోతోందా !

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు, అందులో రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ఈసారి డిసెంబర్ నెల చాలా కీలకంగా మారబోతోంది. డిసెంబర్ నెలలో చోటు చేసుకుంటాయని భావిస్తున్న పరిణామాలే ఇందుకు కారణం. ఈ పరిణామాలు కచ్చితంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో ఆ మేరకు టెన్షన్ పెరుగుతోంది. దీంతో డిసెంబర్ నెలలో ఇరు రాష్టాల్లో చోటు చేసుకుంటాయని భావిస్తున్న పరిణామాలపై ఓ విశ్లేషణ.

ముందుగా తెలంగాణలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీని ఫలితాలు డిసెంబర్ లో వెలువడనున్నాయి. ఈ ఫలితాల కోసం ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ గా ఉన్న అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ ఇచ్చే ఫలితం ఆధారంగా ఏపీలోనూ రాజకీయాలకు పదునుపెట్టేందుకు జాతీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం పడొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీ సహా పలు రాష్ట్రాలపై ప్రభావం తప్పదు. బీజేపీ అధికారంలోకి రాకపోయినా ఎన్నికల్లో టీడీపీ అండ లభిస్తే ఆ ప్రభావం ఏపీపై పడటం ఖాయం.

why december will be turning point for ap, telangana politics ?- here are details

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా సీఎం జగన్ విశాఖకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అందుకే రుషికొండపై ప్రత్యేకంగా క్యాంపు ఆఫీసు కట్టించుకుని మరీ అక్కడికి వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారు. అదే సమయంలో డిసెంబర్ నెలలో సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణ ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు కచ్చితంగా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన పొత్తుల వ్యవహారం కూడా డిసెంబర్లోనే తేలబోతోంది. డిసెంబర్ లో వెలువడే తెలంగాణ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఏపీలో పొత్తులపై బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆ ఎన్నికల తర్వాతే ఏపీలో పొత్తులపై ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ బీజేపీ మరోసారి టీడీపీ-జనసేనతో కలిసి ముందుకెళ్లాలని భావిస్తే మాత్రం వైఎస్ జగన్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది. ఈ టర్నింగ్ పాయింట్ డిసెంబర్లోనే రానుంది.

ఏపీలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ సర్కార్ వరుసగా కేసులు పెడుతోంది. తద్వారా ఆయన్ని జైలు నుంచి బయటికి రాకుండా చూడాలని భావిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడతాయని, ఎన్నికల్లోపు చంద్రబాబును జనంలో తిరగకుండా అడ్డుకుంటే చాలనే భావనలో వైసీపీ ఉంది. కానీ చంద్రబాబుపై పెడుతున్న వరుస కేసుల విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో పోరాడుతున్న టీడీపీ.. ఈ వ్యవహారంలో జగన్ సర్కార్ దూకుడు పెంచితే అదే సుప్రీంకోర్టులో మొత్తం కేసుల విషయంలో తాడోపేడో తేల్చుకోవడం ఖాయం. ఈ లెక్కన డిసెంబర్లో మారే రాజకీయాల్ని బట్టి చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు టర్నింగ్ పాయింట్ కావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+