పుతిన్, జింపింగ్, అబేలను కాదని మోడీకి ఫోన్ చేసిన ట్రంప్: ఎందుకంటే..?
కీలక దేశాలైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ అధ్యక్షుడు షింజో అబేల కంటే ముందే భారత ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ చేయడం విశేషం.
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, కీలక దేశాలైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ అధ్యక్షుడు షింజో అబేల కంటే ముందే భారత ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ చేయడం విశేషం. అంటే, ఆయన అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి మోడీకి ట్రంప్ ఫోన్: ఏం మాట్లాడారంటే..?
అమెరికా సరిహద్దు దేశాలైన కెనడా, మెక్సికో దేశాధినేతలతో శనివారం మాట్లాడిన ట్రంప్, ఆదివారం ఇజ్రాయిల్, ఈజిప్టు దేశాధినేతలతో మాట్లాడారు. ఆ తర్వాత ట్రంప్ ఐదో ఫోన్ కాల్ ప్రధాని మోడీకే వచ్చింది. రష్యా, చైనా, జపాన్‌ల కంటే ముందే మోడీకి ట్రంప్ ఫోన్ చేయడం విశేషమే. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఎన్నికల సమయంలోనే భారతదేశంతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక, రిపబ్లికన్ హిందూ కూటమి కాశ్మీరి పండిట్లు, ఉగ్ర బాధితులు, బంగ్లాదేశీ హిందూ బాధితుల కోసం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ.. డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌కు తొలి శుభాకాంక్షలు చెప్పింది మోడీయే కావడం గమనార్హం. అంతేగాక, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఛైర్మన్‌గా ఇండియన్ అమెరికన్ అయిన అజిత్ పాయిని.. ట్రంప్ నామినేట్ చేశారు. ఆయనది ట్రంప్ పాలనలో కీలక పాత్రే అని చెప్పుకోవచ్చు.
ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన మూడో ఇండియన్ అమెరికన్ అజియ్ పాయి కావడం గమనార్హం. యూన్‌లో యూఎస్ అంబాసిడర్‌గా నిక్కీ హేలే దాదాపు ఖరారయ్యారు. మరో ఇండియన్ అమెరికన్ సీమ వర్మ.. మెడీకేర్ అండ్ మెడీకాయిడ్‌కు అధిపతిగా వ్యవహరించనున్నారు. కాగా, యూఎస్ అటార్నీ ప్రీత్ భరారా తన పదవిలోనే కొనసాగుతున్నారు.
వ్యాపార, వాణిజ్య వ్యవహారాలతోపాటు ఉగ్రవాదం, తదితర అంశాలపై మోడీ, ట్రంప్ తమ ఫోన్ సంభాషణల్లో చర్చించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ కార్యాలయం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సైనిక, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు.
వచ్చే ఏడాది మోడీని అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సవాళ్లను అధిగమించడంలో భారత్ ఓ నిజమైన స్నేహితునిగా ట్రంప్ అభివర్ణించారు. భద్రతాపరమైన అంశాలతోపాటు పలు కీలక అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications