వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగాల కోతల్లోనూ ఈ జాబ్స్‌కు అంత డిమాండ్ ఎందుకు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతల నడుమ టొరంటోలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేసే 'జయదీప్ వచ్చాని’ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

డిమాండ్ ఎక్కువగా ఉండే ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీ రంగంలో జయదీప్ నిపుణుడు. గత అక్టోబరు నెలలో ఆయన ఐదు ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

క్లౌడ్ టెక్నాలజీతో డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్‌కు వీలుపడుతుంది. అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్), మైక్రోసాఫ్ట్ అజూర్ లాంటివి దీనిపైనే పనిచేస్తాయి. మరోవైపు ఆటోమేషన్ విభాగంలో సాఫ్ట్‌వేర్‌లు తయారుచేస్తారు. ఇవి పేపర్‌వర్క్ ప్రాసెసింగ్ లాంటి పనులను కార్మికుల అవసరం లేకుండానే సొంతంగా పూర్తిచేయగలవు.

నవంబరు నాటికి టెక్నాలజీ సంస్థ ''షేర్పా’’లో తనకు తగిన ఉద్యోగాన్ని జయదీప్ సంపాదించారు. ఆన్‌లైన్‌లో ట్రావెల్ వీసా డాక్యుమెంట్లు పొందేందుకు ఈ సంస్థ కస్టమర్లకు సాయం చేస్తుంది.

''యూజర్ ఎక్స్‌పీరియన్స్‌పై ప్రధానంగా దృష్టిసారించే సంస్థ కోసం నేను పనిచేయాలని భావించాను. ముఖ్యంగా ఆ ప్రాడెక్టులతో నాకు పరిచయం ఉండాలి. నేను భారత్ నుంచి కెనడాకు వచ్చినప్పుడు కూడా వీసా పేపర్‌వర్క్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను’’అని ఆయన చెప్పారు. కంపెనీ ఆటోమేషన్ టీమ్‌లో డెవలపర్‌గా ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నారు.

భారీగా ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ, తన నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో తనపై పెద్దగా ఆ ప్రభావం పడలేదని జయదీప్ చెప్పారు. ముఖ్యంగా జావాస్క్రిప్ట్‌లో కోడింగ్, క్లౌడ్‌లో పోడక్ట్స్, డేటా కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌చేయడం లాంటి ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందని ఆయన వివరించారు.

షేర్పాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలో సంస్థ ఉపాధ్యక్షుడు అలెక్స్ గోగన్‌కు స్పష్టత ఉంది. ''సృజనాత్మకంగా ఆలోచించడంతోపాటు అందరితో కలిసి పనిచేసే వారి కోసం మేం అన్వేషణ మొదలుపెట్టాం’’అని ఆయన చెప్పారు.

సాధారణంగా టెక్ రంగంలో జనరలిస్టులను మొదటగా నియమించుకొని మార్కెట్‌లో నిలదొక్కుకోవాలని భావిస్తాయని గోగన్ అన్నారు. అయితే, ఇప్పుడు తాము సాఫ్ట్‌వేర్ స్పెషలిస్టుల కోసం చూస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరు కంపెనీ ప్రాడెక్టులను మరో మెట్టు పైకి తీసుకెళ్లడంతోపాటు కొత్త అభ్యర్థులను మార్గనిర్దేశం కూడా చేయగలరని వివరించారు.

ఇలాంటి నైపుణ్యాలుండే కార్మికులకు నిజంగా ఇది మంచి సమయమని చెప్పుకోవాలి.

మార్గరెట్ ఓమారా

దాదాపు 1.5 లక్షల ఉద్యోగాల కోత

ఒక్క 2022లోనే 900కుపైగా టెక్ కంపెనీలు 1,43,500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ సంస్థ వెల్లడించింది. 2020 నుంచి ఉద్యోగాల కోతలపై సంస్థ పనిచేస్తోంది.

కోవిడ్-19 వ్యాప్తి తర్వాత దాదాపు అన్ని ప్రధాన టెక్ సంస్థల్లోనూ ఉద్యోగాల కోతలు కనిపిస్తున్నాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా దాదాపు 11,000 మంది ఉద్యోగాల నుంచి తొలగించింది. మరోవైపు గత నవంబరులో దాదాపు 10,000 సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

కోవిడ్-19 సమయంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గడిపేవారు. దీంతో అమెజాన్, షాపిఫై లాంటి టెక్ సంస్థలు భారీగా కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే, నేడు ప్రజల ఆన్‌లైన్ సమయం తగ్గింది. దీంతో ఆ టెక్ దిగ్గజాల ఆదాయంపై ప్రభావం పడుతోంది.

ఉద్యోగాల కోత

''ఇదివరకటిలా ఇప్పుడు డిజిటల్ రంగంలో ఆదాయం రావడం లేదు’’అని ద కోడ్: సిలికాన్ వ్యాలీ అండ్ ద రీమేకింగ్ ఆఫ్ అమెరికా’’ పుస్తక రచయిత మార్గరెట్ ఓమారా చెప్పారు.

''వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లాంటి నిధులు కూడా తగ్గిపోయాయి. దీంతో సిలికాన్ వ్యాలీతోపాటు బయట కంపెనీల నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయి’’అని ఆమె చెప్పారు.

టెక్ ఉద్యోగాల కోత విషయంలో మార్కెట్‌లో రెండు ట్రెండ్‌లు కనిపిస్తున్నాయని కాలిఫోర్నియాకు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ సంస్థ ఫ్యూజన్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ లూ ఝాంగ్ చెప్పారు. ''నేడు కంపెనీలు తమ నిధులను రిజర్వు చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇదివరకటిలా భారీ జీతాలు ఉద్యోగులకు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు’’అని ఆమె వివరించారు.

అయితే, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ టెక్నాలజీ ఇంజినీర్లకు సిలికాన్ వ్యాలీలో చాలా డిమాండ్ ఎక్కువగా ఉందని లూ చెప్పారు.

చాలా కంపెనీలు డేటా సేకరణ, ప్రాసెసింగ్‌పై దృష్టిసారిస్తున్నాయి. ముఖ్యంగా తమ బిజినెస్‌ను మెరుగ్గా నిర్వహించేందుకు, కస్టమర్ల గురించి మెరుగ్గా తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.

లూ చెప్పిన అంశాలే ఓఈసీడీ నివేదికలోనూ కనిపించాయి. 2018 నుంచి 2021 మధ్య అమెరికాలో ఈ డిజిటల్ ఉద్యోగాలు 116 శాతం పెరిగినట్లు దీనిలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ ఉద్యోగాల్లో ఎక్కువ డేటా ఇంజినీర్ ఉద్యోగాలే ఉన్నాయి.

మరోవైపు టెక్ కంపెనీల్లో మరొక రకమైన నైపుణ్యాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుందని ఓమారా చెప్పారు. వీటిని నిబద్ధత, సానుభూతి అని ఆమె చెప్పారు.

''నేడు ఎక్కువమంది ఇంజినీరింగ్ నైపుణ్యాల కోసం చూస్తున్న మాట వాస్తవమే. అయితే. అదే సమయంలో తమ ప్రాడక్టుల సోషియాలజీని మెరుగ్గా అర్థం చేసుకొనేవారికి కూడా డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. భిన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని తమ ప్రాడక్టులను మెరుగు పరిచేవారికి అవకాశాలు ఉండనే ఉంటాయి’’అని ఆమె వివరించారు.

మరోవైపు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, టెక్ రిసోర్స్‌లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉందని బ్రిటన్‌కు చెందిన రిక్రూటింగ్ సంస్థ రాబర్ట్ హాఫ్‌కు చెందిన నిపుణుడు క్రైగ్ ఫ్రీడ్‌బర్గ్ చెప్పారు.

''అయితే, కంపెనీలు తమ పరిధిని విస్తరించుకోవడం ఇప్పుడు కష్టమే. ఎక్కువగా తాత్కాలిక ప్రాతిపదికనే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి’’అని ఆయన వివరించారు.

''ఆర్థిక మందగమన సమయంలో ఇలాంటి చర్యలే కంపెనీలు తీసుకుంటాయి. ప్రస్తుతం కూడా అవే పరిణామాలు కనిపిస్తున్నాయి’’అని ఆయన చెప్పారు.

నేడు లిస్బన్, టొరంటో లాంటి సంస్థలు టెక్ సంస్థలను ఆకర్షించేందుకు పన్ను మినహాయింపులు ప్రకటిస్తున్నాయి. అయితే, దీనివల్ల సిలికాన్ వ్యాలీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డెవలపర్లపై ప్రభావం పడుతుందా?

అయితే, ఇక్కడి నుంచి పెద్దగా టెక్ నిపుణులు బయటకు వెళ్లకపోవచ్చని ఓమారా చెప్పారు. ''మెరుగైన నైపుణ్యాలు కలిగిన వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఇక్కడికి వస్తుంటాయి. ఇప్పటికీ సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు మెరుగ్గా జరుగుతున్నాయి’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is there so much demand for these jobs even in job cuts..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X