World Tourism Day:ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం.. ఎందుకింత ప్ర‌త్యేకం..!

ఉద‌యాన్నే లేవ‌డం ఆఫీసుకు వెళ్ల‌డం, తిరిగి సాయంత్రం ఇంటికి రావ‌డం ఇదే అంద‌రి జీవితాల్లో ఉండే దిన‌చ‌ర్య‌. రోజు వారీ ఈ బిజి లైఫ్ నుంచి కాస్త ప్ర‌శాంత‌త కోసం చాలామంది ఎక్క‌డికైనా వెళ్లేందుకు సిద్ధ‌పడుతుంటారు. అంటే కొత్త ప్ర‌దేశాల‌ను చూడ‌డం, కొత్త వారిని క‌ల‌వ‌డం, ప్ర‌యాణించ‌డం, జ్ఞాపకాలను సేకరించడం ఇలాంటివి చేయ‌డ‌మంటే ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారు. ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయినా, సామాన్యుడైనా ప్ర‌తిఒక్క‌రికీ విరామం కావాల్సిందే. ఎవ‌రికి తగ్గ స్థోమ‌త‌లో ఆ విరామ స‌మయంలో వారికి న‌చ్చిన ప్ర‌దేశాల‌ను చుట్టేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు.

ఎంత బిజిగా ఉన్నా స‌రే ప్ర‌యాణాల‌కు స‌మ‌యం కేటాయిస్తుంటారు చాలామంది. మ‌రికొంద‌రు స్నేహితుల‌తో ప్ర‌యాణించేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రేమో కుటుంబంతో క‌లిసి ఫ్యామిలీ ట్రిప్ వేస్తుంటారు. కానీ, ప్ర‌తి మ‌నిషి త‌న జీవితంలో ఏదో ఒక స‌మ‌యంలో అల‌సిపోయి కాస్త విరామం కోరుకుంటాడు. ఆ స‌మ‌యంలో ఎక్క‌డికైనా టూర్‌కి వెళ్లేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటాడు. ప‌ర్యాట‌కం నేటి కాలంలో చాలామందికి ఒక ఉపాధిగా మారింది.

World Tourism Day

దీనివ‌ల్ల చాలామందికి జీవ‌నోపాధి దొరికింది. ప్ర‌పంచంలోని ఏ మూలకు వెళ్లినా మ‌న‌కు పర్యాట‌కం క‌నిపిస్తుంది. ఎందుకీ ప‌ర్యాట‌కం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ప‌్ర‌తిఏటా ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వాన్ని సెప్టెంబ‌ర్ 27న జ‌రుపుకుంటాం. వాటి విశేషాల‌ను ఇప్ప‌డు తెలుసుకుందాం.

World Tourism Day

ఒక్కో ఏటా ఒక్కో అంశంతో..

ఈ రోజు దేశ‌వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుండి కూడా ప‌ర్యాట‌కులు ప‌ర్యాటకం వైపు ఎక్కువ‌గా మొగ్గుచూపుతున్నారు. పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ టూరిజం డే‌ను నిర్వహిస్తారు. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ప్రపంచ పర్యాటక సంస్థ జరుపుకోవడం ప్రారంభించింది. దీని తరువాత మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు 1980లో 'ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని' సెప్టెంబర్ 27న నిర్వహించడం ప్రారంభించారు.

అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ టూరిజం డేను ఒక్కో ఏడాది ఒక్కో అంశంతో జ‌రుపుకుంటున్నారు. 1980లో అంటే మొద‌టిసారిగా 'టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనే పేరుతో టూరిజం డేను నిర్వ‌హించుకున్నారు. ఇలా ప్రతి ఏటా ఒక్కో అంశంతో టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించే విధంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ప్రపంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం 2023 థీమ్‌

ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం 2023 థీమ్ "టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్, ఈ థీమ్, సమయానుకూలమైనది మ‌రియు క్లిష్టమైనది. ఇది పర్యాటకంపై ప‌ర్యావ‌ర‌ణం చూపే ప్ర‌భావాన్నితెలియ‌జేస్తుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నప్పుడు, పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు, ఆవాసాల నష్టం, సహజ వనరులపై ఒత్తిడి వంటి కొత్త ఆందోళ‌న‌లు మొద‌ల‌వుతాయి. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి గ్రీన్ టూరిజం పెట్టుబడి కీలకంగా ప‌నిచేస్తుంది. గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది సుస్థిరత, పర్యావరణ బాధ్యతను నొక్కి చెప్పే ఆర్థిక సహాయం.

వివిధ ర‌కాల పోటీలు..

నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వ‌స్తోంది. ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు, చారిత్రాత్మ‌క నిర్మాణాలు పర్యాటకులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కొన్ని టూరిజం ఆర్గ‌నైజేష‌న్స్ వివిధ ర‌కాల పోటీల‌ను కూడా నిర్వ‌హిస్తున్నాయి. అందువల్లే అభివృద్ధి చెందుతున్న దేశాలకు టూరిజం ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతోంది.

World Tourism Day

ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత అభివృద్ధి చేసే దిశ‌లో భాగంగా 2014లో ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వం థీమ్ టూరిజం అండ్ క‌మ్యూనిటి డెవ‌ల‌ప్ మెంట్‌ను తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్ర‌పంచ‌మార్పు కోరుతూ 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవెలప్‌మెంట్‌ గోల్స్‌పై దృష్టి సారించింది. మ‌రెందుకాలస్యం వీలైనంత త్వ‌ర‌గా మీరు కూడా ఒక టూర్‌కు ప్లాన్ చేసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+