• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టార్గెట్ టీడీపీ: కేసీఆర్ పై ప్రధాని ప్రశంసలు... బాబును మోడీ టార్గెట్ చేశారా..?

|

అవిశ్వాసం పై చర్చ సందర్భంగా శుక్రవారం లోక్‌సభలో రెండు తెలుగు రాష్ట్రాలుపై వాడీ వేడీ చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక మోడీ ప్రసంగంలో సీన్ క్లైమాక్స్‌కు చేరింది. మోడీ తన ప్రసంగంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పొగడటం..చంద్రబాబుదే తప్పంతా అని చూపడం వెనక రాజకీయకోణం ఏమైనా దాగి ఉందా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ మోడీ మనసులో ఏముంది..?

ఎన్డీఏ సర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై మోడీ మండిపడ్డారు. అసలు చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీతో అక్కడ పోరాడలేక తమ ప్రభుత్వంపై కాలుదువ్వడం సరికాదన్నారు ప్రధాని. రాష్ట్రం విడిపోయాకా మొదటి సంవత్సరం అంతా కేసీఆర్ చంద్రబాబుల మధ్య రాష్ట్రానికి సంబంధించిన గొడవలతోనే సరిపోయిందని చెప్పిన మోడీ...

కేసీఆర్ తర్వాత పరిణితితో వ్యవహిరించారని పొగడ్తలు కురిపించారు. చంద్రబాబు మాత్రం ఇంకా మారలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తే..చంద్రబాబు అభివృద్ధిని గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

గుణాత్మక మార్పుపై కేసీఆర్ సైలెంట్

గుణాత్మక మార్పుపై కేసీఆర్ సైలెంట్


మోడీ కేసీఆర్‌పై పొగడ్తలు కురిపించడం రాజకీయ లబ్ధికోసమే అని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలంటూ కేసీఆర్ పలువురు బీజేపీ కాంగ్రెసేతర పార్టీ అధినేతలను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాలంటూ వారితో కలిసి చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని బెంగాల్ సీఎం మమతా తేల్చేశారు. ఇదే క్రమంలో కర్నాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకార సమయంలో కాంగ్రెస్‌‌తో ఇతర ప్రాంతీయపార్టీల నేతలు కలవడం కేసీఆర్‌కు రుచించలేదు. అందుకే ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు ప్రధాన శతృవు కాంగ్రెస్ అన్న సంగతి మరువ కూడదు. ఆ తర్వాత కేసీఆర్ యూటర్న్ తీసుకుని ప్రధాని మోడీని కలవడం గంటసేపు చర్చలు జరపడం జరిగింది. అంతేకాదు నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్‌లో కూడా టీఆర్ఎస్ పాల్గొనలేదు.

మోడీ చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

మోడీ చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

ఇదిలా ఉంటే మోడీ కేసీఆర్‌ పొగిడి చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించడం వెనక మతలబు ఏమిటనేది ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఒక రకంగా చూస్తే కేసీఆర్‌ను పొగిడి చంద్రబాబును మోడీ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న భావన కలుగుతోందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. తెలంగాణ సీఎం అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పడం ద్వారా తొలిసారిగా సీఎం అయిన కేసీఆర్‌ చాలా బాగా పనిచేస్తున్నారని మోడీ చెప్పకనే చెప్పారు. అదేసమయంలో సీఎంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీలో పాలనను గాలికొదిలేశారని కూడా పరోక్షంగా చెప్పినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 హోదాకు ఆర్థిక సంఘానికి సంబంధం ఏంటి..?

హోదాకు ఆర్థిక సంఘానికి సంబంధం ఏంటి..?


ఇప్పటి వరకు చంద్రబాబును ఒక్క మాట కూడా అనని మోడీ ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని నాడు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపారని గుర్తు చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని సాకు చెప్పి తప్పించుకుంటున్న బీజేపీ... 14వ ఆర్థిక సంఘం కాలం రెండేళ్లలో ముగుస్తుంది. అప్పుడు 15వ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అవుతుంది. అందులో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావిస్తామన్న విషయం ప్రధాని ఎందుకు చెప్పలేకున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంటులో చేసే చట్టాలకంటే బలమైనది మరేదీ లేదు. పార్లమెంటు ముందు నీతి ఆయోగ్, ఇతర స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలన్నీ తక్కువే.

టార్గెట్ టీడీపీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యిందా..?

టార్గెట్ టీడీపీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యిందా..?

ఇక ఓవరాల్‌గా చూస్తే ప్రధాని మోడీ పార్లమెంటు వేదికగా యుద్ధం మొదలు పెట్టారని చెప్పక తప్పదు. నిన్న మోడీ ప్రసంగం చూస్తూ ఆయన పార్లమెంటు వేదికగా టార్గెట్ టీడీపీ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ముందుగా స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత వారి రాజకీయ అవసరాల కోసం హోదా నినాదంతో యూటర్న్ తీసుకున్నారని సభ సాక్షిగా మొత్తం దేశం చూస్తుండగా ప్రధాని మోడీ ప్రకటించి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చేతికి ఆయుధం ఇచ్చినట్లుగా స్పష్టం అవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
After the debate on no confidence motion in Loksabha,political cirlces are doubting as why Modi in his speech had given all the compliments to the first time CM KCR and defamed his former partner Chandra babu.Political analysts opine that by showering compliments on KCR, Modi is in a position of blackmailing chandra babu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more