వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రి పదింటికి.. ఓ ఐఏఎస్ కు మోడీ ఫోన్, ఏం చెప్పుంటారు?

|
Google Oneindia TeluguNews

త్రిపుర : సోషల్ మీడియాలో ఇప్పుడో పోస్టు వైరల్ గా మారిపోయింది. ఇందులో నిజానిజాలెంతో తెలియదు గానీ రాత్రి పది గంటల సమయంలో స్వయంగా ప్రధాని మోడీనే త్రిపురకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేశారన్నది ఆ పోస్ట్ సారాంశం.

ఇంతకీ ఏ విషయం మీద ఫోన్ చేసుంటారనే కదా సందేహం..!, సదరు పోస్టులో తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 21వ తేదీ రాత్రి 10 గం.ల సమయంలో పీఎంవో కార్యాలయం నుంచి త్రిపురలోని
ఓ ఐఏఎస్ అధికారికి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ చేసి ఇబ్బందిపెడుతున్నందుకు క్షమాపణలు చెప్పిన పీఎంవో కార్యాలయ అధికారి.. ప్రధాని మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పాడు.

ఈ అనూహ్య పరిణామానికి ఆశ్చర్యానికి లోనైన సదరు అధికారి వెంటనే తేరుకున్నాడు. ఆలోపే ప్రధాని మోడీ లైన్లోకి రావడంతో.. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. రాత్రి వేళ ఫోన్ చేసినందుకు ముందుగా క్షమాపణలు కోరిన మోడీ. అనంతరం ఆ అధికారితో మోడీ ఏం చెప్పారంటే.. వర్షాల ప్రభావంతో త్రిపురలో పూర్తిగా దెబ్బతిన్న జాతీయ రహదారి 208ని వెంటనే పునరుద్దరించాలని అధికారిని కోరారు. ఇదే విషయమై రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, తనకు మధ్య చర్చ జరిగినట్లుగా పేర్కొన్నారు మోడీ.

Why PM Modi called this Tripura IAS officer at 10pm

ఇక స్వయంగా మోడీనే ఫోన్ చేయడంతో.. పట్టరాని ఆనందంతో రాత్రంతా సరిగా నిద్ర కూడా పోని సదరు అధికారి ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్లాడు. ఆయన అక్కడికెళ్లేసరికి రోడ్డుకు మరమ్మత్తులు చేసే జేసీబీలు, పనులకు కావాల్సిన నిధులు సమకూర్చి పెట్టినట్లు సమాచారం. దీంతో నాలుగురోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసేశారు సదరు అధికారి.

సదరు ఐఏఎస్ అధికారి త్వరితగతిన చేపట్టిన చర్యలకు రవాణా మంత్రి కార్యాలయం నుంచి కూడా అభినందనలు అందాయి. ఢిల్లీకి వచ్చినప్పుడు పీఎంవో కార్యాలయంలో ప్రధానిని కలవాల్సిందిగా ఆ అధికారికి ఆహ్వానం కూడా అందింది. సదరు అధికారి కుమారుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో.. విషయం కాస్త వైరల్ గా మారిపోయింది.

English summary
A post on Quora, a question-and-answer website, about PM Modi's call to a Tripura IAS officer, has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X