27 ఓటములు: రాహుల్ గాంధీ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కనున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదు చేయాలని ఓ విద్యార్థి విజ్ఞప్తి చేశారు.

మధ్యప్రదేశ్‌కి చెందిన విశాల్ ధావన్ అనే ఇంజినీరింగ్ విద్యార్ధి ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారిని సంప్రదించాడు. రాహుల్ గాంధీ 27 సార్లు ఎన్నికల్లో ఓడిపోయారని, ఆయనను గిన్నిస్ బుక్‌లో చేర్చాలంటూ దరఖాస్తు పెట్టుకున్నారు.

గిన్నీస్ బుక్ కార్యాలయం రికార్డుల ప్రకారం... సదరు విద్యార్ధి అధికారులకు అప్లికేషన్ ఫీజు కూడా కట్టాడని తెలుస్తోంది. తన అభ్యర్థన స్వీకరించినట్టు నిర్ధారణ పత్రం కూడా తీసుకున్నాడు.

అయితే అమెరికాకి చెందిన గిన్నీస్ బుక్ ఈ తరహా అభ్యర్థనకు ఒప్పుకుంటుందా లేదా అన్ని తెలియాల్సి ఉంది. ఇప్పటికే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో తప్ప నిలబడలేకపోయింది.

రాహుల్ గాంధీ ఓటమిపై సెటైర్లు

రాహుల్ గాంధీ ఓటమిపై సెటైర్లు

ఈ ఓటముల కారణంగా రాహుల్ గాంధీపై సోషల్ మీడియా సెటైర్లు వచ్చాయి. ఇప్పటికే నెటిజన్లు ఆయనపై రకరకాల వ్యంగ్యాస్త్రాలు సంధింస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సదరు విద్యార్థి గిన్నిస్ బుక్‌లోకి రాహుల్ పేరు ఎక్కించాలని చెప్పడం గమనార్హం.

పంజాబ్ మినహా..

పంజాబ్ మినహా..

సార్వత్రిక ఎన్నికల ముందు మినీ సంగ్రామంగా భావించే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో 105 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ ఏడు సీట్లు మాత్రమే గెలిచింది. 403 అసెంబ్లీ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో సత్తా చాటని కాంగ్రెస్, ఎస్పీని కూడా ముంచింది. గోవా, మణిపూర్‌లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఒక్క పంజాబ్‌లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది.

గెలుపు శాతం

గెలుపు శాతం

పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ప్రచారం చేసిన స్థానాలలో గెలుపు శాతానికి, ప్రధాని మోడీ ప్రచారం చేసిన స్థానాలలో గెలుపు శాతానికి పెద్దగా తేడా లేదు.

మోడీ ముందు దిగదుడుపే..

మోడీ ముందు దిగదుడుపే..

మణిపూర్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మాత్రం ప్రధాని మోడీ ప్రచారం చేసిన స్థానాలలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది. రాహుల్ ప్రచారం చేసిన స్థానాలలో మాత్రం కాంగ్రెస్ అంత సత్తా చాటలేదు. మొత్తంగా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మోడీ ప్రచారం చేసిన స్థానాలలో గెలుపు శాతం 70కి పైగా ఉంటే, రాహుల్ ప్రచారం చేసిన స్థానాలలో గెలుపు శాతం ఇరవైకి పైగా మాత్రమే ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After facing consecutive defeats in the assembly elections, Rahul Gandhi has been trolled on the social media. His statements are often mocked at. However, an engineering student from Madhya Pradesh has approached the Guinness Book of World Records with a request to list the Congress vice president.
Please Wait while comments are loading...