ట్రిపుల్ తలాక్ చెప్పి జైలుకెళ్లడం ఎందుకు? మహిళా ఎమ్మెల్యే సంచలన ట్వీట్!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎన్నో అడ్డంకులు, వివాదాల సుడిగుండాలను దాటుకుని 'ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు' లోక్‌సభలో నెగ్గిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కూడా మద్దతిచ్చిన ఈ బిల్లుపై ఇంకా కొన్ని వర్గాలు, కొంతమంది వ్యక్తులు పెదవి విరుస్తూనే ఉన్నారు.

రూటు మార్చిన కత్తి మహేష్, ట్విట్టర్‌లో సంచలన 'ప్రకటన', ఈసారి ఏపీ ఎంపీలపై, ఏమన్నారంటే...

తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా ట్రిపుల్ తలాక్‌ బిల్లును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.

 Why say

''ఎందుకు అనవసరంగా త్రిపుల్ తలాక్ చెప్పి జైలుకు వెళ్తారు.. ఆమెకు ఏమీ చెప్పకుండా వదిలేస్తే భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చు..'' అంటూ ఎమ్మెల్యే ఆల్కా లాంబా ట్వీట్ చేశారు.

దీనిపై పలువురు నెటిజన్లు ఆమెకు మద్ధతు ఇస్తూ రీట్వీట్ చేస్తుండగా.. కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. మోడీ ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. బీజేపీ మద్దతుదారులేమో.. 'కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన మీకు మోడీ గొప్పతనం గురించి ఏం తెలుసు?' అని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AAP MLA Alka Lamba ctitisized Prime Minister Modi on Triple Talaq in her twitter account by posting a tweet. She said in her tweet that " Why say Talaq Talaq Talaq and go to jail, when you can just leave her without saying anything and become the Prime Minister of India". Now this tweet gone viral and many BJP supporters critisizing MLA Alka Lamba with their re-tweets.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X