ఫలితం ముందే తేలిపోయిందా - ఆ పార్టీ మిడిల్ డ్రాప్..!!
ఢిల్లీ ఎన్నికల రాజకీయం హోరా హోరీగా సాగుతోంది. త్రిముఖ పోటీగా కనిపిస్తున్నా.. ప్రధానం గా ఆప్ - బీజేపీ మధ్యనే పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రచారానికి దూర కావటం పై కొత్త సందేహాలు మొదలయ్యాయి. బీజేపీ - ఆప్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ ఒక్క సభకే పరిమితం అయ్యారు. దీంతో, ఢిల్లీ ఫలితం పైన ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రచారానికి చివరి వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మారుతున్న సమీకరణాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారంలో ఉన్న ఆప్ ఇతర పార్టీల కంటే వేగంగా ఎన్నికల బరిలోకి దిగింది. పదమూడేళ్లుగా అధికారంలో ఉన్న కేజ్రీవాల్ పార్టీ తిరిగి మరో సారి అధికారం దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ రాష్ట్ర హోదా తరువాత తొలి రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. తిరిగి పట్టు పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. ఇక, కాంగ్రెస్ తొలుత ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేసింది. కానీ, ఇప్పుడు అసలు సమయం వచ్చే సరికి వెనుకబడినట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ కు ఏమైంది
రాహుల్ గాంధీ నామ మాత్రపు ప్రచారానికి పరిమితం అయ్యారు. అటు ఆప్ నేతలు ప్రతీ ఇంటికి తమ మేనిఫెస్టో తీసుకెళ్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని వర్గాలను ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పించింది. బీజేపీ సైతం తమ సహజ ధోరణికి భిన్నంగా హామీలను ఇస్తూ ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇప్పటికే అమిత్ షా, నడ్డా, యోగీ పార్టీ కోసం ప్రచారం చేసారు. ఇక, వచ్చే వారం ప్రధాని మోదీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉపాధి కల్పన, యమునా నదీ ప్రక్షాళన, అవినీతి నిర్మూలనతో పాటుగా మహిళలను ఆకట్టుకునే హామీలను బీజేపీ తమ ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోంది.

బీజేపీ హామీలతో
ఇక.. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో 20 శాతం కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న షెడ్యూల్డ్ వర్గాలకు 12 సీట్లు రిజర్వ్ చేసారు. ఈ 12 సీట్లను గత ఎన్నికల్లో ఆప్ గెలుచుకుంది. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు తిరిగి తమ పట్టు నిరూపించుకునేందుకు ఆప్ కొత్త హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ సైతం ఎస్సీ మోర్చా నేతలను ఈ నియోజకవర్గాల్లో ప్రచారం కోసం మొహరించింది. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని తాజాగా ప్రకటించింది. దీంతో, ఇప్పుడు త్రిముఖ పోటీగా భావించినా.. ప్రస్తుత పరిణామాల్లో ఆప్ - బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications