ఆ విషయంలో అమ్మాయిలేదే పై చేయి..అబ్బాయిలు మేల్కోండి
వాదనల్లో అమ్మాయిలను గెలవడం కష్టమని చాలా మంది అంటుంటారు. అయితే, ఈ విషయాన్ని ఒక తాజా అధ్యయనం నిజమని నిరూపించింది. వాదనలు, సంబంధాల విషయాల్లో పురుషుల కంటే స్త్రీలే తెలివిగా ఆలోచిస్తారని, సమస్యలను బాగా అర్థం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. 'జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం దీనిని మరింత బలంగా సమర్థిస్తోంది.
గత పరిశోధనల ప్రకారం, స్త్రీలు భావోద్వేగ అవగాహన, సానుభూతిలో పురుషుల కంటే మెరుగ్గా ఉంటారు. ఈ లక్షణాలే సంబంధాల్లో వచ్చే సమస్యలను సునిశితంగా విశ్లేషించడానికి, వాటికి సరైన పరిష్కారాలను కనుగొనడానికి వారికి సహాయపడతాయి. స్త్రీలు తమ భావోద్వేగ తెలివితేటలతో వాదనల మూల కారణాలను గుర్తించి, సమతుల్య పరిష్కారాలను సూచించగలరని అధ్యయనం చెబుతోంది.

వాదనల్లో స్త్రీల ఈ సామర్థ్యం సంబంధాలలో మంచి సంభాషణకు దారితీస్తుందని అధ్యయనం పేర్కొంది. ఇది భాగస్వామిని అర్థం చేసుకోవడం, వారి అభిప్రాయాలను గౌరవించడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది. అయితే, పురుషులు ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటారని దీని అర్థం కాదు. కానీ, వాదనల్లో స్త్రీల భావోద్వేగ విలువ ఎంత ముఖ్యమో ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది.












Click it and Unblock the Notifications