వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ క్యాంపస్ పథకం: రూ. 20 కోట్లతో... 6 యూనివర్సిటీలు, 69 కాలేజీలకు వై-ఫై

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: స్మార్ట్ క్యాంపస్ పథకంలో భాగంగా ఒడిషా ప్రభుత్వం యూనివర్సిటీలు, కళాశాలలకు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది. దీనికోసం రూ. 20కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పథకంలో భాగంగా 6 యూనివర్సిటీలకు, 46 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేటు కళాశాలల్లో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

దీంతో పాటు విద్యాసంస్థలలో అత్యాధునిక స్మార్ట్ క్లాస్ రూంలు, ఈ లైబ్రరీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాబొరేటరీల వంటి సదుపాయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు ఉన్నతా విద్యాశాఖ మంత్రి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి తెలిపారు.

Wi-Fi facilities in 6 universities, 69 colleges of Odisha

గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఈ ఇంటర్నెట్ సదుపాయాన్ని రాబోయే రోజుల్లో మరొకొన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు విస్తరిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ బాధ్యతలను భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అధికారులు చేపడతారని అన్నారు.

దీనిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలలో సర్వే ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రాజెక్టు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత నిధులు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి గగన్ కుమార్ ధాల్ తెలిపారు.

English summary
An amount of Rs 20 crore will be spent to provide Wi-Fi facilities in six universities, 46 government colleges and 23 non-government ones in Odisha in the first phase of a smart campus scheme here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X