Wife: లవ్ మ్యారేజ్, సీమంతం జరిగిన మూడు రోజులకే ?, మొదటి భార్యను గాలికి వదిలేసి !
బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియుడి మాయలో పడిపోయిన యువతి ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. దంపతులు ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. భార్య గర్బవతి అయ్యింది. కంపెనీ యాజమాన్యం సొంత ఖర్చులతో గర్బవతి అయిన మహిళకు గ్రాండ్ గా సీమంతం జరిపించారు. సీమంతం జరిగిన మూడు రోజులకే గర్బిణి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో భర్తకు ఇంతకు ముందే వేరే మహిళతో వివాహం అయ్యిందని, ఆమెను గాలికి వదిలేశాడని, తరువాత ప్రేమ పేరుతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వెలుగు చూడటంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు.

ఒకే కంపెనీలో ఉద్యోగం
బెంగళూరు ఉత్తర తాలుకాలోని శివనపురలోని రాజీవ్ గాంధీ నగర్ లో సంతోష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మాదనాయకనహళ్లిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో సంతోష్ ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్ ఉద్యోగం చేస్తున్న కంపెనీలో సౌందర్య (20) అనే యువతి ఉద్యోగం చేస్తున్నది. సంతోష్, సౌందర్యకు పరిచయం అయ్యింది.

లవ్ మ్యారేజ్
గత ఏడాది సంతోష్, సౌందర్య ప్రేమించుకుంన్నారు. ప్రియుడు సంతోష్ మామలో పడిపోయిన సౌందర్య 11 నెలల క్రితం ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. సంతోష్, సౌందర్య దంపతులు రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటూ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. సౌందర్య గర్బవతి అయ్యింది.

మూడు రోజుల క్రితం సీమంతం
సౌందర్య 8 నెలల గర్బణి. సౌందర్యకు పుట్టింటి వాళ్లు సీమంతం చెయ్యరని, ఆమెను ఇంటికి రానివ్వరని ఆమె పని చేస్తున్న గార్మెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంకు తెలిసి వాళ్ల సొంత ఖర్చులతో గర్బవతి అయిన సౌందర్యకు కంపెనీలోనే మూడు రోజుల క్రితం గ్రాండ్ గా సీమంతం జరిపించారు. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు సీమంతం కార్యక్రమానికి హాజరైనారు.

ఉరి వేసుకున్న గర్బిణి
సీమంతం జరిగిన మూడు రోజులకే 8 నెలల గర్బిణి సౌందర్య ఆమె నివాసం ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. సంతోష్ తాగుబోతు అని, మద్యం సేవించి అతని భార్య సౌందర్యను టార్చర్ పెడుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మొదటి భార్యను గాలికి వదిలేశాడు
పోలీసుల విచారణలో సంతోష్ కు ఇంతకు ముందే వేరే మహిళతో వివాహం అయ్యిందని, మొదటి భార్యను గాలికి వదిలేశాడని, తరువాత ప్రేమ పేరుతో సౌందర్యను నమ్మించి పెళ్లి చేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశాడని వెలుగు చూసింది. సౌందర్యను హత్య చేసిన సంతోష్ ఆమె ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మిస్తున్నాడని ఆత్మహత్య చేసుకున్న మహిళ కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. సీమంతం జరిగిన మూడు రోజులకే సౌందర్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications