మృగంలా మారిన భర్త.. భార్య ముక్కు కొరికి.. చివరకు !!
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం, కానీ ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఒక భర్త ప్రదర్శించిన క్రూరత్వం సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె ముక్కును పళ్లతో కొరికి దాదాపు ఊడిపోయేలా దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన హమీర్‌పూర్ జిల్లా చికాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్‌హాట్ గ్రామంలో వెలుగుచూసింది.
కాగా పెళ్లయినప్పటి నుండి వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని, చిన్న చిన్న విషయాలకే ఫూల్ ఖాన్ ఆమెను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 01 (బుధవారం) రాత్రి ఆ రాత్రి గొడవ జరుగుతున్న సమయంలో ఫూల్ ఖాన్ ఒక్కసారిగా సంయమనం కోల్పోయి, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా క్రూరంగా దాడి చేశాడు.

ఆగ్రహంతో ఆమె ముక్కు మరియు చెంపలను బలంగా కొరకడంతో, ముఖంపై మాంసం ముక్కలు ఊడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. పానా సోదరుడు అమ్రుద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, నిందితుడు తన సోదరిని దాదాపు ప్రాణాలు పోయేంత వరకు బాదాడని, ఆపై ఆమె ముఖాన్ని వికృతంగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పానాను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. వైద్యులు ఆమె చెంపపై పది కుట్లు వేసి రక్తాన్ని అదుపు చేశారు. అయితే, ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ తప్పనిసరని, అప్పుడే ముఖం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తు..
బాధితురాలి సోదరుడు అమ్రుద్దీన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు నిందితుడైన భర్త ఫూల్ ఖాన్ మరియు అతని తండ్రి హబీబ్‌లపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు ఇద్దరూ గ్రామం విడిచి పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించడమే కాకుండా, సమాజంలో పెరుగుతున్న గృహ హింసపై ఆందోళన రేకెత్తిస్తోంది.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications