చాటింగ్ వద్దు: టెక్కి వేళ్లు కత్తిరించిన భార్య
బెంగళూరు: నేను ఉద్యోగానికి వెళ్లిన సమయంలో నిత్యం స్నేహితులకు చాటింగ్ చెయ్యరాదని చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కి) వేళ్లను అతని భార్య కోసి పారేసింది. ఇక మీద నీవు నాలాగా చాటింగ్ చెయ్యడానికి పనికిరావని ముఖం మీద చెప్పింది. ఐటీ-బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో ఈ దారుణం జరిగింది.
బెంగళూరు నగరంలోని సిల్క్ బోర్డు సమీపంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో చంద్రకాంత్ సింగ్, సునీతా సింగ్ దంపతులు నివాసం ఉంటున్నారు. చంద్రకాంత్ సింగ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. సునీతా సింగ్ ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నది.
సునీతా సింగ్ ప్రతి నిత్యం స్నేహితులకు చాటింగ్ చేస్తూ ఉండేది. ఉద్యోగానికి వెళ్లిన సమయంలో చాటింగ్ చెయ్యరాదని చంద్రకాంత్ సింగ్ పలు సార్లు భార్యకు చెప్పాడు. అయితే ఆమె తన పద్దతి మార్చుకోలేదు. ఇదే విషయంలో దంపతుల మధ్య చాలసార్లు గొడవలు జరిగాయి. పలువురు వీరికి నచ్చచెప్పారు.

ఎన్నిసార్లు నచ్చ చెప్పినా సునీతా సింగ్ తన పద్దతి మార్చుకోలేదు. అదే విధంగా నిత్యం ఫోన్ చేతిలో పట్టుకుని స్నేహితులకు చాటింగ్ చేస్తూ ఉండేది. ఒక సారి ఎందుకో అనుమానం రావడంతో చంద్రకాంత్ సింగ్ తన భార్య మొబైల్ ఫోన్ తీసుకుని చూశాడు. చాల ఫోన్ నెంబర్లలో డియర్, డార్లింగ్ అంటూ అవతలి వైపు నుంచి మెసేజ్ లు వచ్చిన విషయం గుర్తించాడు.
ఆ సందర్బంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సునీతా సింగ్ కిచెన్ లో వంట చేస్తున్నది. నా మొబైల్ నీవు ఎందుకు తీసుకున్నావు అని భర్తను గట్టిగా ప్రశ్నించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇంటిలోని వస్తువులు చెల్లాచెదురు చేశారు.
సహనం కొల్పోయిన సునీతా సింగ్ వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని భర్త చంద్రకాంత్ సింగ్ చేతిని పట్టుకుని మూడు వేళ్లు కత్తిరించి పారేసింది. తీవ్రగాయాలైన చంద్రకాంత్ సింగ్ దేవుడా అంటూ సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నాడు. తనను హింసించిందని భార్య మీద చంద్రకాంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications