Wife: భర్త, అత్తమామలను టార్చర్ పెట్టిన కోడలు, ఆవేదనతో తల్లీ, కొడుకు ఒకేసారి ? !
బెంగళూరు: వయసు మీదపడిన తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకున్న కొడుకు అతని తల్లిదండ్రులను ఐటీ హబ్ లోని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడంతో కొడుకు అన్ని సేవలు చేస్తున్నాడు. మీ అమ్మానాన్నను నేను ఎందుకు చూడాలి అంటూ భార్య గొడవ చేసింది. రోజు దంపతుల మద్య ఇదే గొడవ జరుగుతోంది. భార్య టార్చర్ తట్టుకోలేక ఆమె భర్త, అతని తల్లి ఒకేచోట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బెంగళూరులో ఉద్యోగం
కర్ణాటకలోని మడికేరికి చెందిన భాగ్యమ్మ, రమేష్ దంపతులు వారి కుమారుడు శ్రీనివాస్ ను బాగా చదివించారు. బాగా చదువుకున్న శ్రీనివాస్ బెంగళూరు చేరుకుని మెడికల్ రెప్రజెంటేటివ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీనివాస్ కు 8 సంవత్సరాల క్రితం సంధ్యా అనే మహిళతో వివాహం అయ్యింది. శ్రీనివాస్. సంధ్యా దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

సొంత ఇంటికి తల్లిదండ్రులు
శ్రీనివాస్ బెంగళూరులోని రాజగోపాలనగర్ లోని శ్రీగంధద కాలనీలో సొంతంగా ఇంటి స్థలం తీసుకుని ఇంటిని కట్టుకున్నాడు. శ్రీనివాస్, సంధ్యా దంపతులు సొంత ఇంటిలో కాపురం ఉంటున్నారు. శ్రీనివాస్ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురై మంచంపట్టాడు. తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతుండటంతో శ్రీనివాస్ వారిని నెల రోజుల క్రితం బెంగళూరు పిలుచుకుని వచ్చాడు.

రాద్దాంతం చేసిన కోడలు
అత్తమామలు ఇంటికి రావడంతో సంధ్య రగిలిపోయింది. మీ అమ్మానాన్నలను నేను ఎందుకు చూసుకోవాలి అంటూ సంధ్యా ఆమె భర్త శ్రీనివాస్ తో రోజు గొడవపడుతోంది. నేను కొడుకు కాబట్టినేనే చూసుకోవాలని శ్రీనివాస్ అతని భార్యకు చెప్పాడు. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత సంధ్యా ఆమె అత్తమామలను టార్చర్ పెట్టింది.

తల్లీ ఆత్మహత్య
శ్రీనివాస్ తండ్రి పూర్తిగా మంచానికి పరిమితం అయ్యాడు. శ్రీనివాస్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య సంధ్యా అత్తమామలను సూటిపోటి మాటలు మాట్లాడి మీ ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది. కోడలు తీరుతో విసిగిపోయిన అత్త భాగ్యమ్మ మంచం మీద ఉన్న భర్త కళ్ల ముందే రూమ్ లో ఉరివేసుకుంది.

ఆవేదనతో కొడుకు ఆత్మహత్య
ఇంటికి వెళ్లిన కొడుకు శ్రీనివాస్ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం జీర్ణించుకోలేక అదే రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భాగ్యమ్మ, కొడుకు శ్రీనివాస్ కళ్ల ముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే మంచం మీద ఏమీ చెయ్యలేని పరిస్థితిలో శ్రీనివాస్ తండ్రి చూస్తూ ఉండిపోయాడు. కోడలు టార్చర్ తట్టుకోలేక అత్త, ఆమె కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications