Wife friends: భార్యకు కరోనా పాజిటివ్, ఆమె ఫ్రెండ్స్ తో భర్త ఎంజాయ్, పోలీసులు ఎంట్రీతో ? !

అహ్మదాబాద్/ గుజరాత్: బిగ్ షాట్ భార్యకు కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉంది. తనకు కరోనా వైరస్ వ్యాధి నయం అవుతుందా ? లేదా ? అంటూ భార్య డిప్రెషన్ లో ఉంది. తన భార్యను సంతోషంగా చూడాలని బావించిన భర్త సూపర్ స్కెచ్ వేశాడు. భార్యతో అత్యంత సన్నిహితంగా ఉండే మహిళలకు తన ఇంట్లో మందు పార్టీ ఇవ్వాలని భర్త డిసైడ్ అయ్యాడు. అంతే ఫారిన్ లిక్కర్ తెప్పించి గ్రాండ్ గా మందు పార్టీ ఇచ్చాడు. బిగ్ షాట్ ఇంట్లో మందు పార్టీకి కొట్లాడి వెళ్లిన ఓ ఆంటీ భర్తకు ఎక్కడో మండిపోయింది. వేరే వాడి ఇంట్లో నా భార్య పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది ? అంటూ రగిలిపోయిన ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బిగ్ షాట్ ఇంటి తలుపులు తీసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్కరు కూడా ఈ లోకంలో లేకపోవడంతో పోలీసులు బిత్తరపోయారు.

బిగ్ షాట్ ఫ్యామిలీ

బిగ్ షాట్ ఫ్యామిలీ

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోని గ్రీన్ అవెన్యూ మావుల్ కౌంటి-1 ఏరియాలో శ్రీమంతులు నివాసం ఉంటున్నారు. ఇదే ఏరియాలో కేతన్ పటాడియా, ఆయన భార్య అమోలా పటాడియా (42) దంపతులు నివాసం ఉంటున్నారు. కేతన్ పటాడియా దంపతులకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అమోలా పటాడియా లగ్జరీ లైఫ్ అనుభవిస్తోందని సమాచారం.

 భార్యకు కరోనా పాజిటివ్

భార్యకు కరోనా పాజిటివ్

ఇటీవల అనారోగ్యానికి గురైన భార్య అమోలా పటాడియాకు వైద్యపరీక్షలు చేయించారు. అమోలా పటాడియాకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని నిర్దారించారు. కోటీశ్వరుడైన కేతన్ పటాడియా అతని భార్య అమోలా పటాడియాను ఇంట్లోనే ఐసోలేషన్ లో పెట్టి వైద్యులతో చికిత్స చేయిస్తున్నాడు. తనకు వ్యాధి నయం కాదేమో అనే భయంతో అమోలా పటాడియా డిప్రెషన్ లో ఉంది.

భార్య సంతోషంగా ఉండాలని లిక్కర్ పార్టీ

భార్య సంతోషంగా ఉండాలని లిక్కర్ పార్టీ

తన భార్య త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తన ముందు తిరగాలంటే ఆమె స్నేహితులను పిలిచి లిక్కర్ పార్టీతో జల్సా చెయ్యాలని భర్త కేతన్ పటాడియా నిర్ణయించాడు. అనుకున్నట్లే భార్య అమోలా పటాడియా క్లోజ్ ఫ్రెండ్స్, నిత్యం లిక్కర్ పార్టీలతో ఎంజాయ్ చేసే బ్యాచ్ లోని నలుగరిని సెలెక్ట్ చేశాడు.

బెడ్ మీద భార్య..... భార్య ఫ్రెండ్స్ తో భర్త మస్త్ మజా

బెడ్ మీద భార్య..... భార్య ఫ్రెండ్స్ తో భర్త మస్త్ మజా

అమోలా పటాడియా ప్రాణస్నేహితులు అనురాధ గోయల్ (40), షెపాలి పాండే (36), పాయల్ లింబాచియా (40), ప్రియాంకా షా (31) అనే మహిళలకు ఫోన్ చేసిన కేతన్ పటాడియా మా ఇంటికి వస్తే మీకు ఫారిన్ నుంచి తెప్పించిన లిక్కర్ తో పార్టీ ఇస్తానని ఫోన్లు చేసి చెప్పాడు. ప్రాణ స్నేహితురాలి ఇంట్లో మందు పార్టీ అని శ్రీమంతుల భార్యలు నలుగురు ఏగేసుకుని అమోలా పటాడియా ఇంటికి వెళ్లిపోయారు.

 ఆంటీ భర్తకు మండిపోయి పోలీసులకు ఫోన్ చేశాడు

ఆంటీ భర్తకు మండిపోయి పోలీసులకు ఫోన్ చేశాడు

పటాడియా ఇంటికి వెళ్లిన మహిళలు కోవిడ్ పాజిటివ్ తో బాధపడుతున్న అమోలా పటాడియాను పరామర్శించారు. నీకు వ్యాధి త్వరగా నయం అయిపోతుందని, తరువాత మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత స్నేహితురాలి భర్త కేతన్ పటాడియాతో కలిసి ఆ నలుగురు మహిళలు పీకలదాక మద్యం సేవించారు. మందు పార్టీకి గొడవపడి మరీ వెళ్లిన అనురాధా గోయల్ భర్త పోలీసులకు ఫోన్ చేసి కేతన్ పటాడియా ఇంట్లో లిక్కర్ పార్టీ జరుగుతోందని సమాచారం ఇచ్చాడు.

పోలీసుల మైండ్ బ్లాక్.... రచ్చరచ్చ చేసిన మహిళలు

పోలీసుల మైండ్ బ్లాక్.... రచ్చరచ్చ చేసిన మహిళలు

పోలీసులు నేరుగా కేతన్ పటాడియా నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లి తలుపులు తట్టారు. పీకలదాక మద్యం సేవించిన కేతన్ పటాడియా వెళ్లి తలుపులు తీసి మద్యం కిక్కుతో పోలీసుల ముందు ఊగిపోయాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడటంతో వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యింది. నలుగురు మహిళలు పీకలదాక మద్యం సేవించి నిలబడలేని స్థితిలో ఉంటూ ఇంట్లో రచ్చరచ్చ చేస్తున్న విషయం గుర్తించిన పోలీసుల దిమ్మతిరిగిపోయిందని అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక కథనం ప్రచురించింది.

కరోనా కాలం+ మద్య నిషేధం ఎఫెక్ట్

కరోనా కాలం+ మద్య నిషేధం ఎఫెక్ట్

కోవిడ్ పాజిటివ్ వచ్చిన అమోలా పటాడియా మద్యం సేవించలేదని, ఆమె నలుగురు స్నేహితులు (మహిళలు), భర్త కేతన్ పటాడియా పీకలదాక మద్యం సేవించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే శ్రీమంతులు ఎంత మోతాదులో మద్యం సేవించారు అనే విషయం మాత్రం పోలీసులు టెస్టులు చెయ్యలేకపోయారు. కరోనా దెబ్బతో వాళ్ల దగ్గరకు వెళ్లి వాసన చూడలేకపోయామని, వారు మద్యం మత్తులో తూలుతున్న విషయం స్పష్టంగా కనపడిందని పోలీసులు అన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వార్త ప్రచురించింది. మద్య నిషేధం ఉన్న గుజరాత్ లో మద్యం సేవించారని, కోవిడ్ నియమాలు ఉల్లంఘించి లిక్కర్ పార్టీ నిర్వహించారని ఆరోపిస్తూ కేతన్ పటాడియాతో పాటు మందు పార్టీలో పాల్గొన్న నలుగురు మహిళల మీద కేసులు నమోదు చేశామని పోలీసులు అన్నారు. తనను ఎదరించి మందు పార్టీకి వెళ్లిన ఓ మహిళ భర్త పోలీసులకు సమాచారం అందరిని అరెస్టు చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+