Wife: అప్పు తీర్చడానికి ఫ్రెండ్స్ తో భార్యను రేప్ చేయించిన భర్త, సీ విటమిన్ మాత్ర అని నిద్రమాత్రలు !

చెన్నై: విలాసాలకు బానిస అయిన భర్త విచ్చలవిడిగా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేని భర్త అందంగా ఉన్న అతని భార్యను పనంగా పెట్టాడు. అప్పులు ఇచ్చిన స్నేహితులు నీ భార్యను మా పక్కలో పడుకోబెడితే నువ్వు చేసిన అప్పులు అడగమని చెప్పారు. అంతే కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే C విటమిన్ మాత్ర తినాలని భార్యకు మాయమాటలు చెప్పాడు. సీ విటమిన్ మాత్రలకు బదులుగా భార్యకు నిద్రమాత్రలు ఇచ్చిన భర్త అతని ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. నిద్రమత్తులో ఉన్న భార్యకు అప్పులు ఇచ్చిన ఇద్దరు స్నేహితులతో భార్య మీద అత్యాచారం చేయించాడు. రెండో వ్యక్తి అత్యాచారం చేసే సమయంలో భార్యను చిత్రహింసలకు గురి చెయ్యడంతో ఆమెకు మెలుకువ రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.

 మూడు సంవత్సరాల క్రితం !

మూడు సంవత్సరాల క్రితం !

తమిళనాడులోని కడలూరులోని ఎల్ ఆర్ పాళ్యలో నివాసం ఉంటున్న రాజేష్ సెల్వ (30) అనే యువకుడు 21 ఏళ్ల వయసు ఉన్న రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే యవతిని 2018లో వివాహం చేసుకున్నాడు. భార్య రాజేశ్వరితో సంతోషంగా కాపురం చేసిన రాజేష్ రెండు సంవత్సరాల క్రితం ఓ కొడుక్కి తండ్రి అయ్యాడు. వివాహం జరిగిన తరువాత రాజేష్ భార్యతో బాగానే ఉన్నాడు.

 మద్యంకు బానిస......లాక్ డౌన్ ఎఫెక్ట్

మద్యంకు బానిస......లాక్ డౌన్ ఎఫెక్ట్

రాజేష్ పెళ్లి జరగకముందు నుంచి మద్యంకు బానిస అయ్యాడు. ప్రతిరోజు లిక్కర్ లేని రాజేష్ కు నోట్లో ముద్దుదిగదు. గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాజేష్ పనులు చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో మద్యం సేవించడానికి, జల్సా చెయ్యడానికి, కుటుంబ పోషణకోసం రాజేష్ అతని స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు.

 అప్పు ఇచ్చిన ఫ్రెండ్స్ టార్చర్

అప్పు ఇచ్చిన ఫ్రెండ్స్ టార్చర్

భార్య రాజేశ్వరి మీద మొదటి నుంచి భర్త రాజేష్ స్నేహితుల్లో కొందరి కన్నుపడింది. రాజేష్ కు అప్పులు ఇచ్చిన వారిలో సుందరమూర్తి (25), మణికందన్ (26) అనే ఇద్దరు యువకులు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని అతని మీద ఒత్తిడి చేశారు. చేసిన అప్పులు తీర్చడానికి, వడ్డీ చెల్లించడానికి రాజేష్ దగ్గర డబ్బులు లేవు. తమిళనాడులో ప్రస్తుతం కూడా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక రాజేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

 నీ భార్యతో ఎంజాయ్ చేస్తాం...... రుణం, వడ్డీ లేకుండా చేస్తాము

నీ భార్యతో ఎంజాయ్ చేస్తాం...... రుణం, వడ్డీ లేకుండా చేస్తాము

నీకు ఇచ్చిన డబ్బులకు వడ్డీ లేకుండా చెయ్యాలంటే నీ భార్య రాజేశ్వరితో మేము ఎంజాయ్ చేస్తామని మణికందన్, సుందరమూర్తి భర్త రాజేష్ కు చెప్పారు. మొదట రాజేష్ అందుకు అంగీకరించలేదు. లాక్ డౌన్ సమయంలో రోజూ రాజేష్ కు మద్యం తీసిస్తున్న సుందరమూర్తి, మణికందన్ అతన్ని లొంగదీసుకున్నారు. తన భార్య మీద రేప్ చేసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజేష్ అతని ఫ్రెండ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

 C విటమిన్ మాత్రలు అని చెప్పి ?

C విటమిన్ మాత్రలు అని చెప్పి ?

భార్య రాజేశ్వరిని ఎలాగైనా తన స్నేహితులకు అప్పగించాలని రాజేష్ డిసైడ్ అయ్యాడు. సీ విటమిన్ మాత్రలు తింటే మనకు కరోనా రాదని, నువ్వుకూడా తినాలని భార్య రాజేశ్వరిని ఆమె భర్త రాజేష్ మాయమాటలు చెప్పాడు. నిద్రమాత్రలు తీసుకెళ్లిన రాజేష్ వాటిని సీ విటమిన్ మాత్రలు అని భార్యకు ఇచ్చాడు. మాత్రలు తిన్న రాజేశ్వరి నిద్రలోకి జారుకునింది.

 భర్త కళ్ల ముందే భార్యను రేప్ చేసిన ఫ్రెండ్స్

భర్త కళ్ల ముందే భార్యను రేప్ చేసిన ఫ్రెండ్స్

భార్యకు నిద్రమాత్రలు ఇచ్చిన భర్త రాజేష్ అతని ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. మద్యం సేవించిన మణికందన్, సుందరమూర్తి ఎగరేసుకుంటూ రాజేష్ ఇంటికి వెళ్లారు. రాజేష్ కు కూడా మద్యం బాటిల్ ఇవ్వడంతో అతను ఇంట్లోనే పీకలదాక మద్యం సేవించాడు. నిద్రమత్తులో ఉన్న భార్య రాజేశ్వరి మీద రాజేష్ కు అప్పులు ఇచ్చిన ఇద్దరు స్నేహితులు మణికందన్, సుందరమూర్తిని తన భార్య మీద రేప్ చెయ్యాలని రాజేష్ రెచ్చగొట్టాడు. మొదట మణికందన్ ఆమె మీద రేప్ చేశాడు.

 భార్యకు మొలుకువ వచ్చేసింది

భార్యకు మొలుకువ వచ్చేసింది

సుందరమూర్తి అత్యాచారం చేసే సమయంలో అతను ఫ్రెండ్ భార్యను శారీరకంగా హింసాడు. ఆ సమయంలో రాజేశ్వరికి మొలుకువ వచ్చేసింది. అయినా పట్టువదలని సుందరమూర్తి ఆమె మీద అత్యాచారం చేశాడు. పక్కనే భర్త ఉన్న సమయంలో అతని స్నేహితులు అత్యాచారం చెయ్యడంతో రాజేశ్వరి రగిలిపోయింది. రాజేశ్వరి గట్టిగా కేకలు వెయ్యడంతో సుందరమూర్తి, మణికందన్ అక్కడి నుంచి పరారైనారు.

 కామాంధులు, శాడిస్టు భర్త అరెస్టు

కామాంధులు, శాడిస్టు భర్త అరెస్టు

మెలుకు వచ్చిన తరువాత రాజేశ్వరి పెద్దకర్ర తీసుకుని భర్త రాజేష్ ను చితకబాదేసింది. జరిగిన విషయం స్థానికులకు చెప్పిన రాజేశ్వరి కొడుకును పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్త రాజేష్ అతని స్నేహితులతో కలిసి తన మీద అత్యాచారం చేయించాడని రాజేశ్వరి కడలూరులోని పన్రూతి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు శాడిస్టు భర్త రాజేష్ తో పాటు స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన మణికందన్, సుందరమూర్తిని అరెస్టు చేశారని ది న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది. కట్టుకున్న భర్త అతని భార్య మీద ఫ్రెండ్స్ తో రేప్ చేయించడం కలలకం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+